ETV Bharat / business

ఇదే సరైన సమయం.. నేటి నుంచి ఇలా చేద్దాం.. - ఈపీఎఫ్‌

FINANCIAL PLANNING FOR 2022: కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. దేశం ఆర్థిక వ్యవస్థలో ఎన్నో కొత్త మార్పులు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయి. వ్యక్తులుగా మీరూ ఈ సమయంలో కొన్ని అంశాలను సమీక్షించుకోవడం సహా రాబోయే ఏడాది కాలంలో ప్రణాళిక ఎలా ఉండాలి, అందుకోసం ఏం చేయాలన్నది నిర్ణయించుకునేందుకు సరైన సమయం ఇదే.

FINANCIAL PLANNING FOR 2022-2023
కొత్త ఆర్థిక సంవత్సరం
author img

By

Published : Apr 1, 2022, 4:54 AM IST

FINANCIAL PLANNING FOR 2022: సంపాదించే సమయంలోనే రెండో ఆదాయ మార్గాన్ని సృష్టించాలి. ఆర్థిక ప్రణాళికల ముఖ్య లక్ష్యం ఇదే. ఖర్చుల కన్నా ఆదాయం అధికంగా ఉండాలి. అప్పులకు మించి ఆస్తులుండాలి. పొదుపు-పెట్టుబడులతో మీ డబ్బు మీ కోసం కష్టపడుతూ మరింత డబ్బును ఆర్జించాలి. కొత్త ఆర్థిక సంవత్సరంలో వీటిని ప్రధానంగా పాటించేందుకు ప్రయత్నించాలి.

గమ్యంపై స్పష్టత: మార్చి 31, 2022న ఆర్థికంగా మీ పరిస్థితి ఏమిటి? మార్చి 31, 2023 నాటికి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు. మీ లక్ష్యాలు, వాటిని చేరడానికి అనువైన పెట్టుబడి మార్గాలు.. ఇలా మొత్తంగా మీ ఆర్థిక గమ్య స్థానంపై స్పష్టత ఉండాలి. నష్టభయం భరించే సామర్థ్యం, పెట్టుబడి పథకాల్లో ఉండే లాభనష్టాలు అన్నింటిపైనా పూర్తి అవగాహనతో ప్రణాళిక రచించండి. దాన్ని క్రమశిక్షణతో అమలు చేసేందుకు ప్రయత్నించండి. 'నా దగ్గర మిగులుతోంది కొద్ది మొత్తమే' అనే నిరుత్సాహం పనికిరాదు. పెట్టుబడులను వాయిదా వేసే తత్వం మంచిది కాదు.

బీమా చేశారా: మరణం, అనారోగ్యం, వైకల్యం, సంపాదన కోల్పోవడం, ఆస్తి నష్టం.. ఇలా అనుకోని సంఘటనలు ఎన్నో.. ఈ నేపథ్యంలో మీకు, మీ కుటుంబానికి ఎదురయ్యే ఆర్థిక కష్టానికి బీమా రక్షణ కవచంలా పనిచేస్తుంది.

  • జీవిత బీమా: ఇప్పటికీ జీవిత బీమా తీసుకోకపోతే ఆలస్యం చేయొద్దు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్‌ పాలసీలను పరిశీలించండి. బీమా రక్షణ-పొదుపు కలిసి ఉండే సంప్రదాయక పాలసీలనూ ఎంచుకోవచ్చు. బీమా పాలసీలుంటే.. వాటిని సమీక్షించుకోండి. వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ బీమా ఉంటేనే మంచిది. ఆర్జించడం ప్రారంభించగానే బీమా పాలసీని తీసుకోవాలి.
  • ఆరోగ్య బీమా: ఉద్యోగం, వ్యాపారం ఏదైనా కానీయండి.. ప్రతి వ్యక్తీ తనకూ, తన కుటుంబానికి వర్తించేలా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. ఉద్యోగం చేస్తున్న వారికి బృంద బీమా ఉంటుంది. ప్రీమియం చెల్లించే స్తోమత ఉంటే వ్యక్తిగతంగానూ మరో పాలసీ తీసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న వ్యాధులకు వేచి ఉండే సమయం ఎంత? సహ చెల్లింపు, ఉప పరిమితులు ఎలా ఉన్నాయి, నగదు రహిత చికిత్సకు అవకాశం లాంటి విషయాలను పూర్తిగా అధ్యయనం చేయాలి. వ్యక్తిగత ప్రమాద బీమానూ తీసుకోవాలి. బీమా పాలసీని చిన్న వయసు నుంచే ప్రారంభించాలి. గరిష్ఠ వ్యవధికి తీసుకోవాలి. పాలసీ రద్దు కాకుండా చూసుకోవాలి. అవసరం రాకముందే బీమా పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం.

పదవీ విరమణకు సిద్ధంగా: సంపాదిస్తున్నప్పుడే.. అది ఆగిపోయిన రోజున ప్రత్యామ్నాయం ఏమిటన్నది చూసుకోవాలి. పెరుగుతున్న జీవన, ఆయుర్దాయ ప్రమాణాలు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని, పదవీ విరమణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మరణించే వరకూ పింఛను ఇచ్చే పథకాలు, కొన్నేళ్లపాటు హామీ మొత్తాన్ని అందించేవి, పింఛనుదారు మరణిస్తే.. జీవిత భాగస్వామికి ఆ పెన్షన్‌ కొనసాగించే ఉమ్మడి పాలసీలు ఎంచుకోవచ్చు. ఈక్విటీ, మనీ మార్కెట్‌, ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టే జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌), జీవిత బీమా సంస్థలు అందించే పెన్షన్‌ పాలసీలను పరిశీలించాలి.

ప్రారంభం నుంచే: ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఆదాయపు పన్ను ప్రణాళికలు ప్రారంభించాలి. పాత లేదా కొత్త పన్నుల విధానం ఎంపిక మీ ఇష్టం. పాత పద్ధతిలో.. ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌, పీపీఎఫ్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌, సుకన్య సమృద్ధి యోజన, అయిదేళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. జీవిత బీమా ప్రీమియం, ఇద్దరు పిల్లలకు చెల్లించే ట్యూషన్‌ ఫీజు, గృహరుణం అసలు ఇలా.. మొత్తంగా సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000 వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. తక్కువ కాల వ్యవధితో ఉండే పథకాలు ఈఎల్‌ఎస్‌ఎస్‌లు. ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నప్పుడు సెక్షన్‌ 80డీ కింద రూ.25వేల వరకూ మినహాయింపు వర్తిస్తుంది. తల్లిదండ్రులకు తీసుకున్న వైద్యబీమా పాలసీకి రూ.25వేల వరకూ (సీనియర్‌ సిటిజన్లయితే రూ.50వేలు) అదనంగా క్లెయిం చేసుకోవచ్చు. విద్యా రుణానికి చెల్లించే వడ్డీకి సెక్షన్‌ 80ఈ కింద మినహాయింపు పొందవచ్చు. సెక్షన్‌ 24 కింద గృహరుణానికి చెల్లించే వడ్డీకి రూ.2లక్షల వరకూ మినహాయింపు లభిస్తుంది. జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లో మదుపు చేసిన మొత్తానికి సెక్షన్‌ 80సీసీడీ (1బీ) ప్రకారం గరిష్ఠంగా రూ.50వేల వరకూ మినహాయింపు ఉంటుంది. ఈ పెట్టుబడులకు సంబంధించిన వివరాలన్నీ ముందుగానే మీ కార్యాలయంలో అందించండి. బంధువులు స్నేహితులు, ఇతరులకు సరిపోయిన పెట్టుబడి వ్యూహాలు మీకు సరిపోకపోవచ్చు. మీకు అనువైన పథకాలేమిటో స్వయంగా తెలుసుకోండి. మీ పెట్టుబడులు ఉమ్మడిగా ఉండేలా చూసుకోండి. నామినీ పేరు తప్పనిసరిగా ఉండాలి. కుటుంబ సభ్యులకు మీ ఆర్థిక విషయాలన్నీ తెలియజేయాలి.

డబ్బు వృద్ధి చెందేలా: ఫిక్స్‌డ్‌, రికరింగ్‌ డిపాజిట్లు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, సుకన్య సమృద్ధి యోజన, స్థిరాస్తులు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు ఇలా అన్ని రకాల పెట్టుబడుల గురించి పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. మీ నష్టభయ సామర్థ్యానికి తగ్గట్టు.. ఈ పథకాల్లో వైవిధ్యంగా మదుపు చేయాలి. మార్కెట్‌ ఆకర్షణీయంగా ఉన్నప్పుడు ఒకే విడత పెట్టుబడి మంచిదే. క్రమానుగతంగా నెలనెలా మదుపు చేయడం, దీర్ఘకాలం కొనసాగించడం వల్ల ఫలితాలు బాగుంటాయి. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మీ పెట్టుబడులు దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయా లేదా చూసుకోండి. కాలంతోపాటు డబ్బు వృద్ధి చెందేలా, చక్రవడ్డీ ప్రయోజనం లభించేలా పథకాల ఎంపిక ఉండాలి. ద్రవ్యోల్బణంతో మీ పెట్టుబడుల విలువ హరించుకుపోతే.. దీర్ఘకాలంలో కష్టమే.

- జాగర్లమూడి వేణుగోపాల్‌, జెన్‌మనీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.