Financial Deadlines In December 2023 : ఈ 2023 డిసెంబర్ నెలలో కొన్ని కీలకమైన ఆర్థిక అంశాల గడువు ముగుస్తోంది. వాటిలో 8 అత్యంత ప్రధానమైన ఫైనాన్సియల్ డెడ్‌లైన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్ డెడ్‌లైన్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సవరించిన బ్యాంక్ లాకర్ ఒప్పందాలను దశలవారీగా అమలు చేయాలని ఆదేశించింది. ఇందుకు 2023 డిసెంబర్ 31ని ఆఖరి గడువుగా నిర్ణయించింది. కనుక, ఎవరైతే 2022 డిసెంబర్ 31 లేదా అంతకు ముందు బ్యాంక్ లాకర్ తీసుకున్నారో.. వారు కచ్చితంగా లేటెస్ట్ అగ్రిమెంట్‌పై సంతకం చేసి, దానిని డిసెంబర్ 31లోపు సమర్పించాల్సి ఉంటుంది.
2. ఆధార్ అప్డేట్కు చివరి తేదీ : గత పదేళ్లలో ఎవరైతే తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోలేదో.. వారు డిసెంబర్ 14 లోపు ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అవకాశం కల్పించింది. ఆధార్ సంబంధిత మోసాలను నివారించడానికి ఇది తప్పనిసరి.
3. ఎస్బీఐ అమృత్ కలశ్ డెడ్‌లైన్ : భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ.. అమృత్ కలశ్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో 7.10 శాతానికి పైగా వడ్డీ రేటు అందిస్తారు. కనుక ఆశావహులు డిసెంబర్ 31లోపు ఈ స్కీమ్‌లో చేరాల్సి ఉంటుంది.
4. మ్యూచువల్ ఫండ్, డీమ్యాట్ నామినేషన్ : డీమ్యాట్, మ్యూచువల్ ఫండ్ యూనిట్ హోల్డర్లు కచ్చితంగా తమ ఖాతాలకు నామినీలను జత చేసుకోవాలి. ఇందుకోసం సెబీ 3 నెలల గడువు ఇచ్చింది. ఈ గడువు డిసెంబర్ 31తో తీరిపోతుంది. ఒక వేళ ఈ చివరి తేదీలోపు ఎవరైనా తమ డీమ్యాట్, మ్యూచువల్ ఫండ్లకు నామినీలను ఏర్పాటుచేసుకోకపోతే.. వారి ఖాతాలు స్తంభింపజేస్తారు.
5. ఇన్‌యాక్టివ్ యూపీఐ ఐడీస్ : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక సంవత్సరంపాటు ఇన్‌యాక్టివ్‌గా ఉన్న యూపీఐ ఐడీలను, నంబర్‌ను డీయాక్టివేట్ చేయాలని.. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే లాంటి పేమెంట్ యాప్‌లను ఆదేశించింది. థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు.. దీన్ని అమలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువు విధించింది. కనుక యూజర్లు ఈ గడువులోపు తమ యూపీఐ ఐడీ ద్వారా పేమెంట్స్ చేసి, వాటిని యాక్టివ్‌గా ఉంచుకోవడం మంచిది.
6. ఎస్బీఐ హోమ్ లోన్ ఆఫర్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం గృహ రుణాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ 31లోపు ఎవరైతే హోమ్ లోన్ తీసుకుంటారో వారికి 65 బేసిస్ పాయింట్లు వరకు రాయితీ అందిస్తుంది. ఈ ప్రత్యేక రాయితీ వివిధ రకాల గృహ రుణాలకు వర్తిస్తుంది. కనుక ఆశావహులు ఎవరైనా ఉంటే.. వారు ఈ 2023 డిసెంబర్ 31లోపు ఎస్బీఐ హోమ్‌లోన్ కోసం అప్లై చేసుకోవడం మంచిది.
7. ఐడీబీఐ స్పెషల్ ఎఫ్డీ : ఐడీబీఐ బ్యాంక్ రూ.2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించింది. అలాగే అమృత్ మహోత్సవ్ అనే ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ కాలవ్యవధిని 375 రోజులు నుంచి 444 రోజులకు పొడిగించింది. ఈ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లలో చేరడానికి ఆఖరు తేదీ డిసెంబర్ 31.
8. ఇండియన్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీ : ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్.. 'ఇండ్ సూపర్ 400', 'ఇండ్ సుప్రీం 300' అనే రెండు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌ల గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది. కనుక ఆసక్తి ఉన్నవారు ఈ డిసెంబర్ నెలాఖరులోగా ఈ స్కీమ్‌ల్లో చేరాల్సి ఉంటుంది.
డిసెంబర్ 1 నుంచి న్యూ సిమ్ కార్డ్ రూల్స్ - ఉల్లంఘిస్తే రూ.10 లక్షలు పెనాల్టీ/ జైలు శిక్ష!