Factors To Consider While Closing Your Loan Account : ఆర్థిక అవసరాలు పడినప్పుడు చాలా మంది లోన్లు తీసుకుని.. తర్వాత తిరిగి చెల్లిస్తారు. అయితే.. తీసుకున్న రుణాన్ని పూర్తిగా చెల్లించిన తర్వాత కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. లోన్ మొత్తం చెల్లించేశాం కదా అని అలాగే నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీరు కొన్ని పనులు కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంది. లేదంటే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
ప్రీ-క్లోజింగ్ ఛార్జీలు: మీ లోన్ ఖాతాను మూసివేసేటప్పుడు ప్రీ క్లోజర్ ఛార్జీల కోసం తనిఖీ చేయాలి. వ్యక్తిగత రుణాన్ని గడువుకు ముందుగానే చెల్లించేందుకు బ్యాంకులు సైతం అనుమతిస్తాయి. అయితే.. ప్రీ క్లోజర్ చెల్లింపులపై కొంత పెనాల్టీ వర్తిస్తుంది. కొన్ని బ్యాంకులు రుణం తీసుకున్న కొంత కాలం వరకు కూడా పాక్షిక, ముందస్తు చెల్లింపులు రెండింటినీ అనుమతించవు. అది ఎంత కాలం అనేది ఆయా బ్యాంకును బట్టి ఉంటుంది. మరోవైపు.. ముందస్తు చెల్లింపుల విషయంలో పెనాల్టీ వర్తిస్తుందా లేదా? అని మీరు బ్యాంకును అడిగి తెలుసుకోవాలి. ఒక వేళ ఎలాంటి ఛార్జీలు విధించకపోతే ముందస్తు చెల్లింపులు చేయడం ఉత్తమం. వడ్డీ భారం తగ్గించుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫ్లోటింగ్-రేటు గృహ రుణాలపై ముందస్తు చెల్లింపు పెనాల్టీలను నిషేధిస్తుంది. కానీ స్థిర-రేటు గృహ రుణాలపై 3 శాతం వరకు పెనాల్టీని అనుమతిస్తుంది.
Personal Loan Tips: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలియకపోతే అంతే!
క్రెడిట్ బ్యూరోలకు విషయం చేర్చాలి: మీరు తీసుకున్న లోన్‌ను పూర్తిగా చెల్లించిన తర్వాత ఆ విషయాన్ని కచ్చితంగా క్రెడిట్ బ్యూరో సంస్థలకు తెలియజేయాలి. మీరు లోన్ తీసుకున్నప్పుడు లేదా క్రెడిట్ కార్డు పొందినప్పుడు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు ఆ విషయాన్ని క్రెడిట్ బ్యూరోలకు తెలియజేయడంలో చాలా ఫాస్ట్‌గానే ఉంటాయి. అయితే.. లోన్ క్లోజ్ అయిపోయిన తర్వాత పరిస్థితి వేరేలా ఉండొచ్చు. అందుకే.. మీరు మాత్రం మీ క్రెడిట్ రిపోర్ట్‌లో లోన్ క్లోజ్ అయినట్లు వచ్చేంత వరకు బ్యాంకులను సంప్రదిస్తూనే ఉండండి.
ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకోవాలి: కొన్ని రుణాలకు బ్యాంకులు ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా తీసుకుంటాయి. అందువల్ల మీరు మీ రుణ మొత్తాన్ని పూర్తిగా చెల్లించిన తర్వాత వీటిని వెనక్కి తీసుకోవడం మరిచిపోవద్దు. హోమ్ లోన్ తీసుకునే సమయంలో మీకు బ్యాంక్ ఎల్‌ఓడీ అందిస్తుంది. ఇందులో మీరు ఇచ్చిన డాక్యుమెంట్ల వివరాలు ఉంటాయి. లోన్ అమౌంట్ పూర్తియిన తర్వాత ఈ ఎల్‌ఓడీ ద్వారా మీ డాక్యుమెంట్లు తీసుకోవచ్చు. ఎల్‌ఓడీలో బ్యాంక్ స్టేట్‌మెంట్స్, ఇన్‌కమ్ ప్రూఫ్, ప్రాపర్టీ పేపర్స్, పొసెషన్ లెటర్ వంటి వివరాలు ఉంటాయి. ఇకపోతే కొన్ని బ్యాంకులు సెక్యూరిటీ చెక్స్ కూడా తీసుకుంటాయి. వీటిని కూడా తీసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీరు వ్యక్తిగతంగా బ్రాంచ్‌కి వెళ్లి అన్ని పత్రాలను మీరే సేకరించాలని గుర్తుంచుకోండి. కొరియర్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పత్రాలను పంపమని రుణదాతను అడగవద్దు. పత్రాలను పొందిన తర్వాత, అవి మంచి స్థితిలో ఉన్నాయో లేదో కూడా మీరు తనిఖీ చేయాలి.
How To Get Business Loan : బిజినెస్ లోన్ కావాలా?.. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!
ఎన్ఓసీ తీసుకోవాలి: మీరు రుణ మొత్తాన్ని పూర్తిగా చెల్లించిన తర్వాత బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి కచ్చితంగా ఎన్‌ఓసీ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఎన్‌ఓసీ సర్టిఫికెట్ మీ వద్దా ఉంటే.. మీరు రుణ మొత్తాన్ని పూర్తిగా చెల్లించారని, లోన్ అకౌంట్ క్లోజ్ అయ్యిందని అర్థం. ఎన్‌వోసీ సర్టిఫికెట్ మీ వద్ద ఉంటే.. ఇక మీరు బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఎన్‌ఓసీ సర్టిఫికెట్‌లో పేరు, లోన్ అకౌంట్ నెంబర్, ఇతర వివరాలు కచ్చితంగా ఉండేలా చేసుకోండి.
EMI వివరాలను చూడాలి: రుణగ్రహీతలు ఆఖరి EMIను సరిగ్గా సమీక్షించాలి. ఆ మొత్తాన్ని రుణదాతకు జమ చేసే తేదీ వరకు చెల్లింపులు పూర్తిగా జరిగాయని నిర్ధారించుకోండి. అలాగే 'పే లేటర్' ను ఉపయోగించి చెల్లింపు చేసినట్లయితే, కస్టమర్ క్లియరెన్స్ సమయాన్ని చేర్చాలి. తర్వాత పెనాల్టీలను చెల్లించకుండా ఉండటానికి సరైన వడ్డీ గణనను పొందాలి.
Loan Default : ఒకసారి లోన్ డిఫాల్డ్ అయితే.. మళ్లీ బ్యాంక్ రుణం మంజూరు అవుతుందా?