ETV Bharat / business

ట్విట్టర్​ బాటలోనే మెటా సంస్థ.. భారీగా ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం!

author img

By

Published : Nov 7, 2022, 1:04 PM IST

ట్విట్టర్‌ బాటలోనే మెటా కూడా నడవనుంది. త్వరలోనే సంస్థకు చెందిన ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో భారీగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించనుంది.

facebook-parent-meta-plans-large-scale-layoffs-this-week
మెటాలో భారీగా ఉద్యోగాల కోత

ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటాలో భారీగా ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ కోతలు వేల సంఖ్యలోనే ఉండొచ్చని ఆంగ్లపత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంలో పేర్కొంది. నవంబర్‌ 9వ తేదీన ఈ అంశంపై మెటా నుంచి ప్రకటన వెలువడవచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెప్పినట్లు తెలిపింది.

సెప్టెంబర్‌ 30వ తేదీ నాటి గణాంకాల ప్రకారం ప్రస్తుతం మెటాలో ప్రపంచవ్యాప్తంగా 87,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మూడో త్రైమాసిక ఫలితాల్లో మెటా వాటాదారులను నిరాశపర్చింది. ఈ సందర్భంగా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ మాట్లాడుతూ 2023 వరకు ఉద్యోగుల సంఖ్యను పెంచబోమని.. స్వల్పంగా తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా.. ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి పరిశ్రమలో ఇతర టెక్‌ సంస్థలు అనుసరిస్తున్నట్లే నియామకాలు తగ్గించుకోవడమో, లేదా ఉద్యోగుల సంఖ్యలో కోత విధించుకోవడమే చేయవచ్చు.

గత వారం సిలికాన్‌ వ్యాలీలో పలు సంస్థలు భారీగా లేఆఫ్‌లను ప్రకటించాయి. మరోవైపు అమెజాన్‌ సంస్థ కార్పొరేట్‌ ఆఫీస్‌లో కొత్త నియామకాలను నిలిపివేసినట్లు పేర్కొంది. ట్విట్టర్‌ దాదాపు 3,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపట్టింది. మరోవైపు ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటివి ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి సంస్థల వాణిజ్య ప్రకటనల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో మెటా లాభం 52 శాతం కుంగి 4.4 బిలియన్‌ డాలర్లకు చేరింది.

ఇవీ చదవండి:

అంబానీయే నంబర్​ వన్​.. భారత్​లో రిలయన్స్‌ అగ్రస్థానం.. ప్రపంచంలో 20వ స్థానం

'8 డాలర్లకే బ్లూటిక్​' సేవలు ప్రారంభం .. త్వరలోనే భారత్​లో సైతం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.