ETV Bharat / business

నెలకు రూ.9వేల పెన్షన్, అప్లై ఎలా చేసుకోవాలో తెలుసా - వయోవృద్ధుల పెన్షన్​ స్కీం

పింఛ‌ను హామీనిచ్చే ప్ర‌ధాన మంత్రి వ‌య వంద‌న యోజ‌న ప‌థకం మరికొన్ని నెలల్లో ముగియనుంది. సీనియర్‌ సిటిజ‌న్లు ఈ పథకానికి ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి 2023 మార్చి 31వ తేదీని గడువుగా నిర్ణయించారు. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

.
.
author img

By

Published : Aug 20, 2022, 5:35 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన నెల‌కు పింఛ‌ను హామీనిచ్చే ప్ర‌ధాన మంత్రి వ‌య వంద‌న యోజ‌న (PMVVY) ప‌థకం మరికొన్ని నెలల్లో ముగియనుంది. సీనియర్‌ సిటిజ‌న్లు ఈ పథకానికి ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి 2023 మార్చి 31వ తేదీని గడువుగా నిర్ణయించారు. దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసీ ఈ ప‌థ‌కాన్ని నిర్వ‌హిస్తోంది. 'PMVVY' అనేది 60 ఏళ్లు, అంత‌కంటే ఎక్కువ వ‌య‌స్సు ఉన్న సీనియ‌ర్ సిటిజ‌న్లకు ప్రభుత్వం అందించే స‌బ్సిడీ పెన్ష‌న్ ప‌థ‌కం. క‌నీస‌, గ‌రిష్ఠ మొత్తాన్ని ఏక‌మొత్తంగా చెల్లించి ప్లాన్‌ని కొనుగోలు చేసిన సీనియ‌ర్ సిటిజ‌న్లకు ఈ ప‌థ‌కం త‌క్ష‌ణ‌మే అమల్లోకి వస్తుంది. నెల‌వారీ, త్రైమాసిక‌, అర్ధవార్షిక, వార్షిక ప్రాతిప‌దిక‌న‌ పెన్ష‌న్‌ను అందిస్తారు. సాధార‌ణ పెన్ష‌న్ కోసం చూస్తున్న సీనియ‌ర్ సిటిజ‌న్లు ఈ ప‌థ‌కాన్ని ఎంచుకోవ‌చ్చు. అయితే ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్టాలంటే చేతిలో గ‌ణ‌నీయ‌మైన మొత్తం ఉండాలి.

అర్హ‌త:
దేశంలోని 60 ఏళ్లు పూర్తి అయిన‌వారు అంత‌కంటే ఎక్కువ వ‌య‌స్సు ఉన్న సీనియ‌ర్ సిటిజ‌న్లు 'PMVVY' ప‌థ‌కాన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ ప‌థ‌కానికి కొనుగోలు చేయ‌డానికి గ‌రిష్ఠ వ‌యోప‌రిమితి లేదు. ద‌ర‌ఖాస్తుదారుడు త‌ప్ప‌నిస‌రిగా భార‌తీయ పౌరుడై ఉండాలి. పాల‌సీ వ్య‌వ‌ధిలో ఎప్పుడైనా పాల‌సీని స‌రెండ‌ర్ చేయ‌వ‌చ్చు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ (స్వీయ‌, జీవిత భాగ‌స్వామి) విష‌యంలో పాల‌సీదారులు కొనుగోలు ధ‌ర‌లో 98% ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు.

పాల‌సీకి కావ‌ల‌సిన ప‌త్రాలు:
ఆధార్ కార్డు, పాన్ కార్డు, వ‌య‌సు రుజువు, చిరునామా, బ్యాంక్ ఖాతా పాస్ బుక్‌, ద‌ర‌ఖాస్తుదారుని పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ముఖ్యంగా కావాలి. ఏదైనా ఎల్ఐసీ బ్రాంచికి వెళ్లి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు ఫారం ఎల్ఐసీ బ్రాంచి వ‌ద్ద ల‌భిస్తుంది. లేదా ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి ఆన్‌లైన్‌లో కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

పెన్ష‌న్ తీసుకోవ‌డానికి కాలవ్య‌వ‌ధి:
'PMVVY' కింద మొద‌టి విడ‌త పెన్ష‌న్.. ప‌థ‌కం కొనుగోలు తేదీ నుంచి 1 సంవ‌త్స‌రం, 6 నెల‌లు, 3 నెల‌లు, 1 నెల (ఫించ‌నుదారుడు ఎంచుకున్న విధంగా) త‌ర్వాత ప్రారంభ‌మ‌వుతుంది. ఉదా: మీరు నెల‌వారీ పెన్ష‌న్ చెల్లింపు విధానాన్ని ఎంచుకుంటే.. మీరు ఇప్ప‌డు ప‌థ‌కాన్ని కొనుగోలు చేస్తే 1 నెల త‌ర్వాత మీ పెన్ష‌న్ చెల్లింపులు ప్రారంభ‌మ‌వుతాయి.

మెచ్యూరిటీ ప్ర‌యోజ‌నాలు:
'PMVVY' పెన్ష‌న్‌, మ‌ర‌ణ, మెచ్యూరిటీ ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ఖాతాదారు ఎంచుకున్న పెన్ష‌న్ విధానంపై ఆధార‌ప‌డి 'PMVVY' 10 సంవ‌త్స‌రాల పాల‌సీ కాలానికి పెన్ష‌న్‌ని అందిస్తుంది. 10 సంవ‌త్స‌రాల పాల‌సీ వ్య‌వ‌ధిలో ఫించ‌నుదారుడు మ‌ర‌ణిస్తే పాల‌సీ కొనుగోలు ధ‌ర ల‌బ్ధిదారునికి తిరిగి ఇచ్చేస్తారు. ఖాతాదారుడు 10 సంవ‌త్స‌రాల పాల‌సీ కాలానికి జీవించి ఉంటే, చివ‌రి వాయిదాతో పాటు కొనుగోలు ధ‌ర తిరిగి ఇచ్చేస్తారు.

వ‌డ్డీ రేటు:
ప్ర‌స్తుత వార్షిక వ‌డ్డీ రేటు 7.40%. 2023 మార్చి 31 వ‌ర‌కు ఇదే వ‌డ్డీ రేటు అమ‌లులో ఉంటుంది. పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో ఉన్న వ‌డ్డీరేటు.. 10 సంవ‌త్స‌రాల పూర్తి కాల వ్య‌వ‌ధికి వ‌ర్తిస్తుంది.

క‌నిష్ఠ, గ‌రిష్ఠ పెన్ష‌న్:
చందాదారుడు పొందే పెన్ష‌న్ మొత్తం వారి కొనుగోలు ధ‌ర‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. కొనుగోలు ధ‌ర రూ.1,62,162 చెల్లిస్తే 'PMVVY' కింద అనుమ‌తించిన క‌నీస పెన్ష‌న్ నెల‌కు రూ.1,000 కాగా.. రూ. 15 ల‌క్ష‌లు చెల్లించిన వారికి గ‌రిష్ఠంగా పెన్ష‌న్ నెల‌కు 9,250 వస్తుంది. సీనియ‌ర్ సిటిజ‌న్లు ఈ ప‌థకంలో గ‌రిష్ఠంగా రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. వార్షిక పెన్ష‌న్ ఒకేసారి రూ.1,11,000 కావ‌ల‌సిన‌వారు రూ.14,49,086 పాల‌సీ కొనుగోలు ధ‌ర‌ను చెల్లిస్తే స‌రిపోతుంది. పాల‌సీదారుడు ఒక‌టి కంటే ఎక్కువ‌సార్లు ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్టొచ్చు. అయితే ఈ ప్లాన్‌లోని అన్ని పాల‌సీల కింద ఒక వ్య‌క్తికి సంబంధించిన మొత్తం కొనుగోలు ధ‌ర రూ.15 ల‌క్ష‌ల‌కు మించ‌కూడ‌దు. భార్యభ‌ర్త‌లిద్ద‌రూ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌యితే ఒక్కొక్క‌రు రూ. 15 ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు.

ప‌న్ను మిన‌హాయింపు లేదు:
'PMVVY' అనేది ప‌న్ను ఆదా ప‌థ‌కం కాదు. ఈ ప‌థ‌కం ద్వారా వ‌చ్చే రిట‌ర్న్‌ల‌కు వ‌ర్తించే ప‌న్ను రేటు ప్ర‌కారం ప‌న్ను విధిస్తారు. కాంట్రిబ్యూష‌న్‌కి ఆదాయ‌పు ప‌న్ను రాయితీ లేదు. ఈ ప‌థ‌కంలో ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80సి కింద పాల‌సీదారులు మిన‌హాయింపును క్లెయిమ్ చేయ‌లేరు. అయితే 'PMVVY' జీఎస్‌టీ నుంచి మిన‌హాయింపు ఉంటుంది. పాల‌సీ కొనుగోలు కోసం.. పాల‌సీదారు ఆధార్ నంబ‌ర్ ధ్రువీక‌ర‌ణ‌ను క‌లిగి ఉండాలి. నెఫ్ట్ లేదా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్ట‌మ్ ద్వారా పెన్ష‌న్ చెల్లింపులు చేస్తారు.

.
పాల‌సీ కొనుగోలు ధ‌ర‌, పెన్ష‌న్‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు.

ఇదీ చదవండి:

క్రెడిట్​ స్కోరు తగ్గితే వడ్డీ భారం మోయాల్సిందేనా

ఐటీ రిఫండ్‌ ఇంకా రాలేదా, ఏం జరిగిందో తెలుసుకోండి మరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.