ETV Bharat / business

'ట్విట్టర్​తో డీల్ కష్టమే.. అలా చేస్తేనే ముందుకు..!' - ట్విట్టర్ కొనుగోలు మస్క్

Twitter deal Elon Musk: ట్విట్టర్​ కొనుగోలు ఒప్పందం అమలు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఫేక్ ఖాతాల విషయంలో ఎలాన్ మస్క్ అనుమానాలే ఇందుకు కారణం.

Elon Musk Twitter deal
'ట్విట్టర్​తో డీల్ కష్టమే.. అలా చేస్తేనే ముందుకు..!'
author img

By

Published : May 17, 2022, 2:35 PM IST

Updated : May 17, 2022, 3:12 PM IST

Elon Musk Twitter deal: దిగ్గజ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. మరో సంచలన ట్వీట్ చేశారు. ట్విట్టర్​లో ఫేక్​/స్పామ్ ఖాతాలు మొత్తం యూజర్ల సంఖ్యలో 5శాతంకన్నా తక్కువ ఉన్నాయని నిరూపించకపోతే ఆ సంస్థ కొనుగోలు ఒప్పందం విషయంలో ముందుకెళ్లడం కష్టమని తేల్చిచెప్పారు. ట్విట్టర్​లో ఒకరు అడిగిన ప్రశ్నకు జవాబుగా మంగళవారం ఈమేరకు స్పందించారు మస్క్.

twitter deal on hold: ట్విట్టర్​ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నారు మస్క్. అయితే.. ఆ సోషల్ మీడియా ప్లాట్​ఫాంలో ఫేక్ ఖాతాలపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఫేక్ యూజర్లు 5శాతం కన్నా తక్కువే ఉండొచ్చని ట్విట్టర్ చెబుతున్నా.. అది 20శాతం ఉండొచ్చన్నది ఆయన వాదన. అందుకే ఈ విషయంపై స్పష్టత వచ్చేవరకు ముందడుగు కష్టమని స్పష్టం చేశారు మస్క్.

'ట్విట్టర్​లో 20 శాతం వరకు ఫేక్ అకౌంట్లు ఉండొచ్చు. ట్విట్టర్ సంస్థ చెబుతున్న దానికి ఇది నాలుగు రెట్లు ఎక్కువ. 5శాతం కన్నా తక్కువే స్పామ్ ఖాతాలు ఉన్నాయని బహిరంగంగా రుజువు చేయడానికి ట్విట్టర్ సీఈఓ నిరాకరించారు. ఆయన రుజువు చేసేవరకు డీల్ ముందుకు సాగదు' అని మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. ఇదివరకు ఇదే విషయాన్ని ఓ కార్యక్రమంలోనూ చెప్పారు. ట్విట్టర్​కు తాను ముందుగా ప్రకటించిన 44 బిలియన్ డాలర్ల కన్నా తక్కువే చెల్లించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు, భావప్రకటన స్వేచ్ఛను ట్విట్టర్ విశ్వసించదని ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'ఆ సంస్థలో కొనసాగాలంటే ఉద్యోగులు తమ భావజాలాలను పక్కన పెట్టి ట్విట్టర్​ అనుసరించే కమ్యూనిస్ట్​ సిద్ధాంతాలనే నమ్మాలి.. ట్విట్టర్​ను మస్క్ కొనుగోలు చేయడం ఉద్యోగులకు నచ్చలేదు' అని ఆ ఉద్యోగి అన్నారు. సిరు మురుగేశన్​గా పేర్కొంటున్న ఆ వ్యక్తి మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పూర్తి కథనం కోసం లింక్​పై క్లిక్ చేయండి.

ట్విట్టర్​లోకి ట్రంప్​..!: కాగా, ట్విట్టర్​లో నిషేధానికి గురై సొంత సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ ఓపెన్​ చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. ఇప్పుడు మళ్లీ ట్విట్టర్​లోకి పరోక్షంగా రీఎంట్రీ ఇచ్చారు. ట్విట్టర్​లో సొంత ఖాతాతో పోస్ట్​లు షేర్​ చేసుకునే అవకాశం లేకపోవడం వల్ల ఆయన స్థాపించిన 'ట్రూత్​ సోషల్​' నుంచి పోస్ట్​లను ట్విట్టర్​లో షేర్​ చేస్తున్నారు. ఇకపై ట్రంప్​ ప్రతి పోస్ట్​ను ట్విట్టర్​లో షేర్​ చేస్తామని ట్రూత్​ సోషల్ ప్రకటించింది.

ఇదీ చదవండి:

8 ఏళ్లు.. 30 కొనుగోళ్లు.. 2014 నుంచి అదానీ సామ్రాజ్య విస్తరణ ఇలా..

LIC IPO: నేడే ఎల్‌ఐసీ ఐపీఓ లిస్టింగ్‌.. లాభాలా? నష్టాలా?

Last Updated : May 17, 2022, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.