ETV Bharat / business

ట్విట్టర్​ యూజర్లకు మస్క్​ షాక్​- వారు డబ్బు చెల్లించాల్సిందే!

Elon Musk Twitter: కొద్దిరోజుల కింద ట్విట్టర్​ను సొంతం చేసుకున్న ఎలాన్​ మస్క్​.. తాజాగా షాకింగ్​ ట్వీట్​ చేశారు. కమర్షియల్​, ప్రభుత్వ ఖాతా వినియోగదారుల నుంచి కొంత మొత్తం డబ్బు వసూలు చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Elon Musk hints at Twitter charging commercial, govt users

author img

By

Published : May 4, 2022, 1:10 PM IST

Elon Musk Twitter: కొద్దిరోజుల కింద ట్విట్టర్​ను కొనుగోలు చేసిన టెస్లా అధిపతి ఎలాన్​ మస్క్​.. మరో సంచలన ట్వీట్​తో వార్తల్లో నిలిచారు. ప్రభుత్వ, వాణిజ్య వినియోగదారుల నుంచి కొంత మొత్తం సేవా రుసుమును వసూలు చేయాలనుకుంటున్నట్లు పోస్ట్​ చేశారు. అయితే.. సాధారణ వినియోగదారులకు మాత్రం ఎల్లప్పుడూ ఉచితమేనని ప్రకటించారు. ఈ విధానాన్ని అమలు చేస్తే.. యూజర్ల నుంచి ఛార్జీ వసూలు చేసే తొలి పెద్ద సోషల్​ మీడియా కంపెనీగా ట్విట్టర్​ నిలుస్తుంది.

Elon Musk hints at Twitter charging commercial, govt users
ఎలాన్​ మస్క్

''ట్విట్టర్​ సేవలు.. సామాన్య వినియోగదారులకు ఎల్లప్పుడూ ఉచితమే. కానీ.. కమర్షియల్​/ప్రభుత్వ వినియోగదారులకు కొంచెం ఖర్చు కావొచ్చు.''

- ఎలాన్​ మస్క్​, టెస్లా సీఈఓ

కొద్దిరోజుల కిందట సుమారు 44 బిలియన్‌ డాలర్లకు ట్విట్టర్​ను సొంతం చేసుకున్న మస్క్​.. ఇందులో పలు మార్పులు చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఆ దిశగా ఇప్పుడు అడుగులు వేశారు. సీఈఓ పరాగ్​ అగర్వాల్​, లీగల్​ హెడ్​ విజయ​ గద్దెను కూడా తొలగించనున్నట్లు తెలుస్తోంది. తమ భద్రత గురించి ఉద్యోగులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నాయకులు ఎన్నికల్లో ప్రచారానికి, అభివృద్ధి సంక్షేమాల గురించి ప్రజలకు తెలిసేందుకు ట్విట్టర్​ను ప్రధాన అస్త్రంగా వాడుతుంటారు. ప్రజలకు చేరువయ్యేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం వాణిజ్య ప్రకటనలకు ట్విట్టర్​ను ఎంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి పోస్ట్​లు చేయాలంటే రుసుం చెల్లించాల్సిందేనని మస్క్​ హింట్​ ఇచ్చారు.

ఇవీ చూడండి: పరాగ్​కు ఉద్వాసన తప్పదా? 'ట్విట్టర్​' ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన

ట్విట్టర్​ను మస్క్​ ఏం చేయబోతున్నారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.