ETV Bharat / business

అమెరికా సంస్థతో డాక్టర్​ రెడ్డీస్​ బిగ్​ డీల్​ - dr reddys medicine

ప్రముఖ ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్​ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. 50 మిలియన్​ డాలర్లకు అమెరికాకు చెందిన ఈటన్​ ఫార్మాసూటికల్స్​ సంస్థ ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది.

dr reddys news
dr reddys news
author img

By

Published : Jun 24, 2022, 9:26 PM IST

అమెరికాకు చెందిన ఈటన్​ ఫార్మాసూటికల్స్​తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు డాక్టర్​ రెడ్డీస్​ లాబోరేటరీస్​ ప్రకటించింది. 50 మిలియన్​ డాలర్లకు బ్రాండెడ్​, జెనరిక్​ ఇంజెక్టబుల్​ ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు డాక్టర్​ రెడ్డీస్ సంస్థ శుక్రవారం తెలిపింది. సుమారు 5 మిలియన్ డాలర్లు వెంటనే చెల్లించడంతో పాటు మిగతా 45 మిలియన్ డాలర్లు తర్వాత చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం రోగులకు సరసమైన ధరకే మందులను అందించేలా ప్రోత్సహిస్తుందని కంపెనీ పేర్కొంది. ఏప్రిల్​ 2022 నాటికి అమెరికాలో ఈ ఉత్పత్తుల మార్కెట్​ విలువ సుమారు 174 మిలియన్​ డాలర్లని సంస్థ చెప్పింది.

"కొవిడ్​ మహమ్మారికి చాలా కాలం ముందు.. కొన్ని క్రిటికల్ కేర్​ ఉత్పత్తుల గురించి ఆసుపత్రులు ఆందోళనలు చెందేవి. ఈ ఒప్పందంతో అనేక మందులు రోగులకు అందుబాటులో ఉంటాయి. ఈ కారణంతో పాటు అనేక ఇతర కారణాల వల్ల ఈ ఒప్పందం చేసుకున్నాం. వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది."

- మార్క్ కికుచి, రెడ్డీస్​ లాబోరేటరీస్​

ఇదీ చదవండి: కార్లకు ఇకపై 'స్టార్​ రేటింగ్స్'.. కేంద్రం కొత్త రూల్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.