Cars Under 10 Lakhs : పండగ సీజన్లో కొత్త కారును కొనాలనుకుంటున్నారా? అది కూడా బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉన్న బ్రాండెడ్ కార్ల కోసం వెతుకుతున్నారా? అయితే మార్కెట్లో వివిధ కార్ల కంపెనీలు అందిస్తోన్న ఫెస్టివల్ ఆఫర్స్, డిస్కౌంట్ల అంటూ అందిస్తోన్న సూపర్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టాటా పంచ్..
Tata Punch iCNG : ఈ ఏడాది విడుదలైన టాటా పంచ్ ప్రారంభ ధర రూ.7.10లక్షలు(ఎక్స్-షోరూం)గా ఉంది. 60 లీటర్ల ఫ్యూయెల్ కెపాసిటీ కలిగిన ఈ ఎస్‌యూవీలో ట్విన్-సిలిండర్ టెక్నాలజీని వినియోగించారు. ARAI-క్లెయిమ్ చేసిన మైలేజ్ 26.9kg/kmగా ఉంది. ఈ మోడల్‌పై రూ.5,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది టాటా మోటార్స్. ఈ కార్ ఫైవ్ స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్‌ను కూడా పొందింది. ఇందులో రెండు ఎయిర్ బ్యాగ్‌లను ఏర్పాటు చేసింది టాటా సంస్థ.

మారుతీ ఫ్రాంక్స్..
Maruti Fronx : అత్యాధునిక హంగులతో మారుతీ సంస్థ రూపొందించిన బడ్జెట్ కార్లలో మారుతీ ఫ్రాంక్స్ ఒకటి. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్(ACC) సిస్టమ్‌తో పాటు OTA అప్‌డేట్‌లను జోడించారు. 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED టైల్‌లైట్లు, వైర్‌లెస్ ఫోన్ కనెక్టివిటీ, నాలుగు స్పీకర్లు, ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్‌ను కూడా Maruti Fronxలో ఇన్స్టాల్ చేశారు. ARAI సర్టిఫై కలిగిన ఈ మోడల్ 21.79kmpl మైలేజీని అందిస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ.9.13 లక్షలు(ఎక్స్-షోరూం)గా ఉంది.

రెనాల్ట్ ట్రైబర్..
Renault Triber : ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ మోడల్ Renault Triber కూడా బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంది. ఇది థ్రీ లైన్ సీటింగ్ సిస్టమ్(ఏసీ)తో పాటు ఆకర్షణీయమైన అవుట్‌లుక్‌ను కలిగి ఉంది. మిక్స్డ్ కలర్ కాంబినేషన్స్‌తో తీసుకువచ్చిన ఈ మోడల్ కార్ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. పండగ సీజన్‌ను పురస్కరించుకొని ఈ మోడల్ ఎస్‌యూవీపై రూ.65,000 వరకు డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈనెల చివరి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. భద్రతాపరమైన ప్రమాణాలతో రూపొందించిన ఈ ఎస్‌యూవీలో మొత్తం 4 ఎయిర్‌బ్యాగులను ఫిక్స్ చేశారు. గ్లోబల్-NCAP రేటింగ్‌లో నాలుగు స్టార్లను దక్కించుకుంది ఈ మోడల్ కార్. రూ.6.34 లక్షల నుంచి దీని ధర ప్రారంభమవుతుంది.

నిస్సాన్ మాగ్నైట్..
Nissan Magnite : రెనాల్ట్ వ్యాపార భాగస్వామి అయిన నిస్సాన్ కూడా సరికొత్త ఆఫర్స్‌ను ఈ పండగ సీజన్‌కు ప్రకటించింది. అన్ని రకాల డిస్కౌంట్లు కలుపుకొని ఏకంగా రూ.97,000 వరకు డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తుంది కంపెనీ. అయితే ఈ ఆఫర్ అనేది మీరు నివసించే ప్రాంతంపై ఆధారపడి ఉంది. ఈ ఆఫర్ నవంబర్ ఆఖరు వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ORVMలు, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆరు స్పీకర్లు, LED లైటింగ్, 4 ఎయిర్‌బ్యాగులు సహా మరెన్నో అడ్వాన్స్డ్ ఫీచర్లను గమనించవచ్చు. ప్రస్తుతం ఈ మోడల్ ఎక్స్-షోరూం ధర రూ.6.50 లక్షలుగా ఉంది.

ఎంజీ కామెట్ ఈవీ..
MG Comet EV : ఎంజీ కంపెనీ నుంచి లాంఛ్ కామెట్ రెండో విద్యుత్ కారు MG Comet EV. టాటా టియాగో EV, సిట్రోయెన్ eC3లకు పోటీగా నిలుస్తోంది MG Comet ఎలక్ట్రిక్ కార్. ESP, కీలెస్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, OTA అప్డేట్లతో కూడిన టెలిమాటిక్స్, LED లైటింగ్, వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీ, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే వంటి సూపర్ ఫీచర్లను ఈ ఫంకీ లిటిల్ EVలో చూడవచ్చు. ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ.7.98 లక్షలు(ఎక్స్-షోరూం)గా ఉంది. మూడు సంవత్సరాల వరకు బ్యాటరీపై వారెంటీని కూడా అందిస్తుంది సంస్థ.

దీపావళి బంపర్ ఆఫర్ - ఆ కారుపై రూ.7 లక్షల వరకు తగ్గింపు!
దివాళీ ఆఫర్ - ఈ ఎలక్ట్రిక్ కారుపై భారీ డిస్కౌంట్, అదిరే ఫీచర్లు మీ సొంతం!