ETV Bharat / business

Car Discounts In September 2023 : కొత్త కారు కొనాలా?.. మారుతి, హోండా కార్లపై భారీ డిస్కౌంట్స్​!.. సూపర్ ఆఫర్స్​! - బెస్ట్ కార్ ఆఫర్స్ ఇన్ తెలుగు

Car Discounts In September 2023 In Telugu : పండుగ సీజన్​ మొదలుకానున్న నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ కార్లపై భారీ డిస్కౌంట్స్​ ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్​ మాసంలో మారుతి సుజుకి, హోండా కంపెనీలు తమ బ్రాండెడ్​ కార్లపై భారీగా డిస్కౌంట్స్​, ఆఫర్స్​, ఎక్స్ఛేంజ్ బోనస్​లను అందిస్తున్నాయి. మరి ఆ ఆఫర్స్, డిస్కౌంట్స్ ఏమిటో చూద్దాం రండి.

Maruti Suzuki Discounts on September 2023
Car Discounts In September 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 1:44 PM IST

Car Discounts In September 2023 : మారుతి సుజుకి.. ఈ దేశీయ బ్రాండ్​కు మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉంది. ఎవరైనా కొత్త కారు కొనాలనుకుంటే.. ముందుగా చూసేది మారుతి కార్లనే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరు కూడా మారుతి కారు కొనాలని ఆశపడుతున్నారా? అయితే మీకు గుడ్​ న్యూస్​. మారుతి సుజుకి కంపెనీ తమ బ్రాండెడ్​ కార్లపై.. సెప్టెంబర్​ మాసంలో భారీ డిస్కౌంట్స్, బంపర్​ ఆఫర్స్​ ప్రకటించింది. మరి ఏవేంటో చూద్దామా?

Maruti Alto 800 : మారుతి సుజుకి.. అల్టో 800 పెట్రోల్​ వేరియండ్ కారుపై కస్టమర్లకు మంచి బెనిఫిట్స్ అందిస్తోంది. ముఖ్యంగా ఎక్స్ఛేంజ్ బోనస్​ కింద రూ.15,000, కార్పొరేట్​ డిస్కౌంట్​ కింద రూ.4,100 అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్​లో మారుతి ఆల్టో 800.. రూ.3.54 నుంచి రూ.5.13 లక్షలు ప్రైస్​ రేంజ్​లో లభిస్తోంది. ఇప్పుడు అందిస్తున్న డిస్కౌంట్లతో మరింత తక్కువ ధరకే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ కారు మీ సొంతమవుతుంది.

Maruti Alto 800
మారుతి ఆల్టో 800

నోట్​ : మారుతి ఆల్టో 800 సీఎన్​జీ వేరియంట్లపై మాత్రం ఎలాంటి డిస్కౌంట్స్​, ఆఫర్స్ అందించడం లేదు.

Maruti Alto K10 : మారుతి ఆల్టో కె10 కార్లపై బెస్ట్ ఆఫర్స్​ నడుస్తున్నాయి. ఆల్టో కె10 పెట్రోల్ వేరియంట్​పై రూ.35,000 వరకు, సీఎన్​జీ వేరియంట్​పై రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్​ అందిస్తున్నారు. అలాగే మారుతి హ్యాచ్​బాక్​ వేరియంట్స్​ అన్నింటిపై కూడా ఎక్స్ఛేంజ్​ బోనస్​ కింద రూ.15,000, కార్పొరేట్ డిస్కౌంట్​ కింద రూ.4,100 ఇస్తున్నారు.

Maruti Alto K10
మారుతి ఆల్టో కె10

Maruti Celerio : స్టైలిష్​ మారుతి సెలెరియో కారుపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా సెలెరియో పెట్రోల్​ వేరియంట్​పై రూ.40,000; సెలెరియో సీఎన్​జీ వేరియంట్​పై రూ.35,000 క్యాష్​ డిస్కౌంట్​ లభిస్తుంది. దీనికి తోడు ఎక్స్ఛేంజ్​ బోనస్ కింద రూ.20,000, కార్పొరేట్​ డిస్కౌంట్ కింద రూ.5000 అదనంగా ఆదా అవుతుంది.

Maruti Celerio
మారుతి సెలెరియో
  • Maruti S Presso : మారుతి ప్రెస్సో కారు- పెట్రోల్​, సీఎన్​జీ రెండు వేరియంట్లపైనా రూ.35,000 వరకు క్యాష్​ డిస్కౌంట్​ అందిస్తున్నారు. దీనికి తోడు అదనంగా ఎక్స్ఛేంజ్​ బోనస్​గా రూ.20,000, కార్పొరేట్​ డిస్కౌంట్​గా రూ.4,100 ఇస్తున్నారు.

Maruti Wagon-R : మారుతి వ్యాగన్​-ఆర్​ కారుపై అన్ని వేరియంట్లపై రూ.30,000 క్యాష్ డిస్కౌంట్​ లభిస్తుంది. పైగా ఎక్స్ఛేంజ్​ బోనస్​గా రూ.15,000, కార్పొరేట్​ డిస్కౌంట్​గా రూ.4,000 సేవ్​ అవుతుంది.

Maruti Wagon-R
మారుతి వ్యాగన్​-ఆర్​

Maruti Swift : మారుతి కంపెనీ.. స్విఫ్ట్​ కార్లపై బంఫర్​ డిస్కౌంట్ అందిస్తోంది. స్విఫ్ట్​ పెట్రోల్ వేరియంట్​పై రూ.35,000 క్యాష్ డిస్కౌంట్​ సహా, ఎక్స్ఛేంజ్​ బోనస్​గా రూ.15,000, కార్పొరేట్​ డిస్కౌంట్​గా రూ.5000 ఇస్తోంది. స్విఫ్ట్​ సీఎన్​జీ కారుపై క్యాష్ డిస్కౌంట్​ రూ.25,000, కార్పొరేట్ డిస్కౌంట్​ రూ.5000 అందిస్తోంది. ఈ ఆఫర్​ మారుతి స్టోర్స్​లోనూ లభిస్తుంది.

Maruti Swift
మారుతి స్విఫ్ట్​

Maruti Dzire and Brezza : మారుతి.. డిజైర్​, మారుతి బ్రెజ్జా కార్లపై మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి డిస్కౌంట్స్, ఆఫర్స్​ అందించడం లేదు.

Maruti Dzire
మారుతి సుజుకి డిజైర్​

Maruti Suzuki Nexa Models - Discounts and Offers
మారుతి సుజుకి తన నెక్సా మోడల్​ కార్లపై కూడా భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. ముఖ్యంగా ఇగ్నిస్​, బాలెనో, సియాజ్​ కార్లపై మంచి ఆఫర్స్​, డిస్కౌంట్స్ ప్రకటించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Maruti Suzuki Ignis : మారుతి సుజుకి తమ ఇగ్నిస్​ కార్లపై రూ. 35,000 వరకు క్యాష్ డిస్కౌంట్​, ఎక్స్ఛేంజ్​ బోనస్​ రూ.15,000, కార్పొరేట్ డిస్కౌంట్​ రూ.4000 అందిస్తోంది. అంటే మొత్తంగా రూ.54,000 వరకు కస్టమర్​కు ఆదా అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మారుతి ఆల్టో, ఆల్టో కె10, వ్యాగన్​-ఆర్​లను ఎక్స్ఛేంజ్ చేస్తే అదనంగా మరో రూ.10,000 డిస్కౌంట్ సహా, స్క్రాపింగ్ బోనస్​ కింద రూ.5000 అదనంగా లభిస్తుంది. అంటే మారుతి ఇగ్నిస్​ కారు కొనుగోలు చేసిన వారికి రూ.69,000 కలిసి వస్తుంది. అయితే మారుతి ఇగ్నిస్​ సిగ్మా, డెల్టా స్పెషల్ ఎడిషన్​ కార్లపై మాత్రం వరుసగా రూ. 39,000; రూ.49,500 వరకు డిస్కౌంట్​ లభిస్తుంది.

Maruti Suzuki Ignis
మారుతి సుజుకి ఇగ్నిస్​
  • Maruti Suzuki Baleno : మారుతి సుజుకి బాలెనో కార్లపై కూడా మంచి డిస్కౌంట్స్​ లభిస్తున్నాయి. ముఖ్యంగా మారుతి బాలెనో జెటా, ఆల్ఫా సీఎన్​జీ కార్లపై రూ. 35,000 వరకు డిస్కౌంట్​ అందిస్తున్నారు. మారుతి బాలెనో సిగ్మా, డెల్టా వేరియంట్లపై మాత్రం రూ.45,000 వరకు డిస్కౌంట్​ లభిస్తుంది.
  • Maruti Suzuki Caiz : మారుతి సుజుకి నెక్సా మోడల్​ కార్లలోని ఏకైక సెడాన్​.. Ciaz. ఈ కారుపై రూ.33,000 క్యాష్ డిస్కౌంట్​, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్​, రూ.5000 స్క్రాపేజ్ బోనస్​, రూ.3000 కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తున్నారు.

నోట్​ : మారుతి నెక్సా శ్రేణిలోని.. గ్రాండ్ విటారా, XL6, Fronx, జిమ్నీ కార్లపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి డిస్కౌంట్స్, ఆఫర్స్ ప్రకటించలేదు.

హోండా కార్లపై రూ.1,00,000 వరకు భారీ డిస్కౌంట్​
Honda Car Discounts On September 2023 : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కూడా సెప్టెంబర్​ మాసంలో తమ బ్రాండెడ్ కార్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. ప్రస్తుతం హోండా కంపెనీ భారతదేశంలో అమేజ్​, ఫిఫ్త్​-జెన్​ సిటీ, సిటీ హైబ్రిడ్​, ఎలివేట్ అనే నాలుగు మోడల్ కార్లను విక్రయిస్తోంది. వీటన్నింటిపై అందిస్తున్న డిస్కౌంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Honda Amaze : హోండా కంపెనీ ఈ అమేజ్​ కారుపై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్​, రూ.6,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తోంది. అంటే మొత్తంగా కస్టమర్​కు రూ.16,000 ఆదా అవుతుంది. అయితే ఈ హోండా అమేజ్​పై ఎక్స్ఛేంజ్ బోనస్​ మాత్రం అందించడం లేదు.

Honda Amaze
హోండా అమేజ్​

Honda Fifth gen City : హోండా సిటీ కారు కొన్నవారికి రూ.10,000 క్యాష్ డిస్కౌంట్​, రూ.10,000 ఎక్స్ఛేంజ్​ బోనస్​, రూ.8,000 కార్పొరేట్ డిస్కౌంట్​ లభిస్తుంది. పైగా ఏదైనా పాత హోండా కారును ఎక్స్ఛేంజ్​ చేస్తే, అదనంగా మరో రూ.20,000 బోనస్ లభిస్తుంది.

Honda Fifth-gen City
హోండా ఫిఫ్త్​ జెన్​ సిటీ

Honda City Hybrid : హోండా కంపెనీ... సిటీ హైబ్రిడ్ కారుపై క్యాష్ డిస్కౌంట్​, ఎక్స్ఛేంజ్ బోనస్​ అన్నీ కలిపి రూ.1 లక్ష రూపాయల వరకు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇది కొత్త హోండా సిటీ హైబ్రిడ్ కారు కొనాలని ఆశపడుతున్నవారికి బెస్ట్ ఆఫర్ అని చెప్పవచ్చు.

Honda City Hybrid
హోండా సిటీ హైబ్రిడ్​

Honda Elevate : హోండా కంపెనీ ఇటీవల విడుదల చేసిన మధ్యస్థాయి ఎస్​యూవీ.. హోండా ఎలివేట్​పై మాత్రం ఎలాంటి డిస్కౌంట్స్ అందించడం లేదు. ప్రస్తుతం ఆ హోండా ఎలివేట్ కారు ధర రూ.11 లక్షలు (ఎక్స్​ షోరూం)గా ఉంది.

Honda Elevate
హోండా ఎలివేట్

నోట్​ : ఈ కథనంలో పేర్కొన్న డిస్కౌంట్స్, ఆఫర్స్​ అనేవి.. ఆయా ప్రాంతాలు, డీలర్​షిప్స్​ అనుసరించి కొంచెం మారుతూ ఉంటాయని గమనించాలి. కానీ మీరు కోరుకున్న కారును తక్కువ ధరలోనే సొంతం చేసుకోవడానికి ఇది మంచి సమయం అని గుర్తుంచుకోండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.