ETV Bharat / business

Buy used cars : పాత కారు కొనాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - పాత కారు కొనేముందు చూసుకోవాల్సిన డాక్యుమెంట్స్​

Buy used cars : మీరు పాత కారు కొనాలని అనుకుంటున్నారా? కానీ పాత కారు కొనుగోలు చేస్తే మంచిదా? కాదా? అని ఆలోచిస్తున్నారా? నిజమే చాలా మందికి ఈ సమస్య వస్తుంది. మరి ఓ పాత కారు కొనేముందు ఏఏ అంశాలు చూడాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా..

Buy used cars tips
A Complete Guide about how to Buy Used Car in India
author img

By

Published : Jun 26, 2023, 6:13 PM IST

Buy used cars : మనలో చాలా మందికి కొత్త కారు కొనుక్కోవాలని ఆశ ఉంటుంది. కానీ అందుకు తగినంత స్తోమత ఉండదు. అందుకే కనీసం మంచి కండీషన్​లో ఉన్న పాత కారు అయినా కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటాం. ప్రాక్టీస్​ కోసం కొందరు, కుటుంబ అవసరాల కోసం, వ్యక్తిగత ప్రాధాన్యాల కోసమంటూ మరికొందరు.. రకరకాల కారణాలతో పాత కారు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారు. వాస్తవం చెప్పాలంటే, పాత కార్లు చాలా చౌకగా లభిస్తాయి. కానీ ఇందులో చాలా రిస్క్​ కూడా ఉంటుంది. అందుకే.. సెకెండ్​ హ్యాండ్​ కారు కొనేముందు కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మీ బడ్జెట్​ను ముందే నిర్ణయించుకోండి
పాత కారును కొనడానికి ఎంత బడ్జెట్​ కేటాయించాలో ముందే ఓ నిర్ణయానికి రండి. దీని వల్ల ఓవర్ బడ్జెట్​ కాకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలుగుతారు.

రీసెర్చ్​ చేయండి
మీరు బడ్జెట్​ను నిర్ణయించుకున్నాక.. ఏ కంపెనీ, ఏ మోడల్​ కారు బాగుంటుందో రీసెర్చ్ చేయండి. అలాగే మార్కెట్​లోని సెకెండ్ హ్యాండ్​ వాహనాలపై రివ్యూలు చదవండి, ధరలను పోల్చిచూడండి.

టెస్ట్​ డ్రైవ్​ చేయండి
Test drive before buying used car : పాత కారు కొనేముందు కచ్చితంగా టెస్ట్​ డ్రైవ్​ చేసి తీరాలి. సస్పెన్స్ ఎలా ఉంది. వాహనం నడుపుతున్నప్పుడు ఏమైనా ఇబ్బందికరమైన శబ్దాలు, వైబ్రేషన్స్​ వస్తున్నాయేమో చూడాలి. అలాగే కారు ఎలాంటి జర్క్​లు లేకుండా నడుస్తోందా లేదా పరిశీలించాలి. స్టీరింగ్​, బ్రేక్స్​ బాగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి.

కారు పార్టులన్నీ చెక్​ చేయండి
సాధారణంగా ఏదో ఒక లోపం లేకపోతే కారును ఎవరూ అమ్మరు. అందువల్ల కారు మోడల్​, దానిలోని పార్ట్స్​ అన్నీ చూడాలి. కారులోని సేఫ్టీ ఫీచర్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో పరీక్షించాలి. అలాగే కారు వెలుపలి భాగంలో ఏమైనా డ్యామేజీ అయ్యిందో లేదో చూసుకోవాలి. అలాగే కారు మీద ఎలాంటి గీతలుగానీ, సొట్టలు గానీ ఉన్నాయేమో పరిశీలించండి.

మెకానిక్​తో టెస్ట్​ చేయించాలి
Used car mechanic inspection : మనం ఎంతగా పరీక్షించినప్పటికీ పాత కారు కొనేముందు కచ్చితంగా ఓ మెకానిక్​తో ఇన్స్​పెక్షన్​ చేయించడం చాలా మంచిది. ఎందుకంటే మనకు తెలియని ఎన్నో అంతర్గత సమస్యలు మెకానిక్​లకు తెలుస్తాయి.

డాక్యుమెంట్​ వెరిఫికేషన్​ తప్పనిసరి
Used car buying documents : అన్నికంటే ముఖ్యమైన విషయం పాత కారు కొనేముందు అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో? లేదో? చూసుకోవడం. ముఖ్యంగా న్యాయపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కింద పేర్కొన్న డాక్యుమెంట్స్​ అన్నీ కచ్చితంగా పరిశీలించండి.

  • రిజిస్ట్రేషన్​ సర్టిఫికేట్​ (ఆర్​సీ) : ఈ ఆర్​సీ వల్ల కారుకు సంబంధించి నిజమైన, చట్టబద్ధమైన యజమాని ఎవరో తెలుస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అమ్మే వ్యక్తి చూపించిన ఆర్​సీ నిజమైనదా లేదా ఫేక్​ డాక్యుమెంటా అనేది కూడా చూసుకోవాలి. ఒక వేళ మీరు డీలర్ వద్ద కొంటే.. ఆర్​సీ డీలర్​ పేరు మీద ఉందో లేదో చూసుకోవాలి. ఒక వేళ మీరు కొంటున్న కారు మరీ పాతదైనా, లేదా థర్డ్​ హ్యాండ్​ అయినా.. దాని ధర చాలా తక్కువగా ఉంటుందని గుర్తించాలి.
  • వీఐఎన్ అండ్​ ఇంజిన్​ నంబర్స్ : వాహనంపై ఉన్న ఇంజిన్​ నంబర్​, ఆర్​సీలో ఉన్న ఇంజిన్​ నంబర్​ ఒకటేనా లేదా అనేది కూడా కచ్చితంగా చూడాలి. అలాగే కారుకు సంబంధించిన వీఐఎన్​ నంబర్..​ ఇన్సూరెన్స్​ డాక్యుమెంట్​లో ఉందో లేదో చెక్​ చేసుకోవాలి.
  • ఇన్సూరెన్స్​ : చట్టబద్ధంగా డ్రైవింగ్ చేయాలంటే కచ్చితంగా చెల్లుబాటులో ఉన్న ఇన్సూరెన్స్​ ఉండాలి. మీరు కారు కొన్న కనీసం 3 వారాల వరకు ఆ ఇన్సూరెన్స్​ పనిచేసేలా ఉండాలి. కానీ మీరు పాతకారు కొన్న వెంటనే మీ పేరు మీద ఆ ఇన్సూరెన్స్​ను ట్రాన్స్​ఫర్​ చేసుకోవడం ఎంతైనా మంచిది. ఒక వేళ అది వీలుకాకపోతే.. కొత్త ఇన్సూరెన్స్​ తీసుకోండి.
  • సర్వీస్​ హిస్టరీ : కారు సర్వీస్ బుక్​ను కచ్చితంగా చూడాలి. ఇది పాత యాజమాని కారును ఎంత చక్కగా మెయిన్​టెన్​ చేశాడో తెలియజేస్తుంది. రెగ్యులర్​గా కారును సర్వీస్​ చేసి ఉంటే.. కారును జాగ్రత్తగా చూసుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా పాత యజమాని చూపించిన సర్వీస్​ బుక్​ నిజమైనదా లేదా ఫేక్​దా అని చూసుకోవాల్సి ఉంటుంది.
  • రోడ్​ టాక్స్​ సర్టిఫికేట్​ : సాధారణంగా రోడ్​ టాక్స్​ అనేది కొత్త కారు కొనేముందు చేసే సింగిల్​ టైమ్ పేమెంట్​. కనుక కచ్చితంగా ఇది పాతయజమాని దగ్గర ఉండి తీరాలి. ఒక వేళ అతని వద్ద రోడ్​ టాక్స్ సర్టిఫికేట్​ లేకపోతే కారు కొనకపోవడమే మంచిది. ఎందుకంటే కారుపై ఎలాంటి టాక్స్​ బకాయిలు ఉన్నా ఈ రోడ్​ టాక్స్​ సర్టిఫికేట్​ ద్వారా మనకు తెలిసిపోతుంది. ఇది లేకపోతే.. తరువాత ఆ భారం మీకు చుట్టుకుంటుంది.
  • పొల్యూషన్​ అండర్​ కంట్రోల్​ సర్టిఫికేట్​ : దీని ద్వారా కారు ఇంజిన్​ కండిషన్, ఎమిషన్​ లెవల్స్​​ మీకు తెలుస్తాయి.
  • లోన్​ నో అబ్జెక్షన్​ సర్టిఫికేట్​ (ఎన్​ఓసీ) : ఒక వేళ కారు యజమాని లోన్​పై కారు కొనుగోలు చేసి ఉంటే.. దానిని మీకు క్లియర్​ చేసే మీకు అమ్మాల్సి ఉంటుంది. ఈ విషయం మీకు లోన్​ నో అబ్జెక్షన్​ సర్టిఫికేట్ ద్వారా తెలుస్తుంది.

బేరం ఆడండి
ఒక సారి పాతకారు కొందామని డిసైడ్​ అయిన తరువాత కచ్చితంగా యజమానితో బేరం అడండి. ఈ ధర తగ్గించమని ఆడిగే విషయంలో ఎలాంటి మొహమాటాలు పడకండి.

పాత కార్లు ఎక్కడ కొంటే మంచిది?

  • ప్రైవేట్​ సెల్లర్స్​ : ఆన్​లైన్​లో లేదా క్లాసిఫైడ్​ యాడ్స్​ ద్వారా మీరు ప్రైవేట్ సెల్లర్స్​ను సంప్రదించవచ్చు. ఈ విధానంలో తక్కువ రేటుకే కారు లభించవచ్చు. కానీ రిస్క్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి కొనే ముందే అన్ని అంశాలు పరిశీలించుకోవడం మంచిది.
  • పాత కార్లు అమ్మే డీలర్స్​ : మార్కెట్​లో పాత కార్లు అమ్మే డీలర్లు చాలా మంది ఉంటారు. వీరి దగ్గర చాలా మోడల్స్​ కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా వీరు కొన్ని సార్లు వారంటీ కూడా ఇస్తారు. కానీ ప్రైవేట్​ సెల్లర్ల దగ్గర కంటే ఈ డీలర్ల వద్ద కార్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి.
  • ఆన్​లైన్ మార్కెట్​ ప్లేసెస్​ : ఈ-బే లాంటి ఈ కామర్స్ వెబ్​సైట్స్​ దేశంలో అమ్మకానికి ఉన్న పాత కార్లు అన్నింటినీ చూసుకునే అవకాశం కల్పిస్తాయి. మంచి కార్లు, యూనిక్ కార్లు గురించి తెలుసుకోవడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. కానీ ఆన్​లైన్​లో చూసినదానికి, నిజమైన దానికి చాలా వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. అందువల్ల కొనేముందు చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం.

గమనిక :
పాత కారు కొనడం వల్ల చాలా వరకు డబ్బు ఆదా అవుతుంది. కానీ ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. కనుక సరైన అనుభవం ఉన్న నిఫుణుల సలహాల మేరకు పాత కారు కొనుగోలు చేయడం ఉత్తమం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.