Buy Second Hand Car Online : కారు కొనాలి.. అందులో ఎక్కి తిరగాలని అందరికీ కోరికగా ఉంటుంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ తమకంటూ ఓ సొంత కారు ఉంటే బాగుండు అని అనుకుంటారు. కానీ, ప్రస్తుత రోజుల్లో ఓ కొత్త కారు కొనాలంటే లక్షలతో కూడుకున్న వ్యవహారం. అంత పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించలేని వారు కనీసం సెకెండ్ హ్యాండ్ కారైనా కొందామని అనుకుంటారు. ఎందుకంటే ఈ రకమైన కార్లు కాస్త తక్కువ ధరలో దొరకుతాయి కాబట్టి. ఇలాంటి వారికోసమే మార్కెట్లో కొన్ని కంపెనీలకు చెందిన ప్రముఖ వెబ్సైట్లు లేదా యాప్లు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో వాహన రిజిస్ట్రేషన్ దగ్గర్నుంచి వాటి డాక్యుమెంటేషన్ వరకు పూర్తి ప్రక్రియ కార్ల క్రయవిక్రయాలు జరిపే ఈ కంపెనీలే చూసుకుంటాయి. మరి అలాంటి సేవలిందిస్తున్న టాప్ వెబ్సైట్స్ వివరాలు మీకోసం(How To Buy Second Hand Car Online).
Websites To Buy Used Cars : సెకెండ్ హ్యాండ్ కార్ల క్రయవిక్రయాలు జరిపే టాప్ అప్లికేషన్స్ లేదా వెబ్సైట్స్ ఇవే..
CarDekho |
olx |
Quikr |
CarTrade |
CarWale |
Truebil |
cartoq |
car bazaar |
Car Collection |
Cars24 |
లాభాలు..
Benefits Of Buying Used Car Through Websites : సెకెండ్ హ్యాండ్ కార్లను నేరుగా యజమాని దగ్గర్నుంచి కొనే సమయాల్లో పత్రాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, బేరసారాలు ఇలా కొన్ని రకాల సమస్యలు ఎదురుకావచ్చు. కానీ, వాడిన కార్లను అమ్మే కొన్ని రకాల యాప్స్ లేదా వెబ్సైట్స్ ద్వారా మీకు నచ్చిన కారును కొనుగోలు చేస్తే భవిష్యత్లో ఎటువంటి సమస్యలు రాకపోవచ్చు. ఎందుకంటే ఈ సెకెండ్ హ్యాండ్ కారుకు సంబంధించి రిజిస్ట్రేషన్, వారంటీ సహా తదితర అంశాలన్నీ సంబంధిత కంపెనీయే చూసుకుంటుంది. దీంతో కారుకు సంబంధించి మీకు భవిష్యత్లో ఎలాంటి సమస్యలు ఎదురుకాకపోవచ్చు.
బ్యాంకుల ద్వారా కూడా..
Bank Car Auction Websites : బ్యాంకు నిబంధనల ప్రకారం.. సాధారణంగా కొందరు కస్టమర్లు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు ఆ వ్యక్తికి సంబంధించిన వాహనాలను సీజ్ చేస్తుంటాయి. అలాంటి వాటిల్లో కారు కూడా ఒకటి. అలా సీజ్ చేసిన సెకెండ్ హ్యాండ్ కార్లను బ్యాంకులు కొద్ది రోజుల తర్వాత వేలం వేసి అమ్మేస్తుంటాయి. వీటిని మీకు కావాల్సిన బడ్జెట్ ధరల్లోనే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా సదరు కారుకి సంబంధించి మొత్తం ధ్రువపత్రాలను బ్యాంకులే మీకు అందజేస్తాయి. స్వయంగా బ్యాంక్ తరఫున మీరు కొనుగోలు చేస్తారు కాబట్టి భవిష్యత్లో మీకు ఎటువంటి సమస్యలు తలెత్తవు.
- నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) Residex
వెబ్సైట్- https://www.nhb.org.in/Residex.aspx
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) Auction
వెబ్సైట్- https://rbi.org.in/Scripts/BS_ViewRTGS.aspx
- స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (SBI) Auctions
వెబ్సైట్- https://www.sbi.co.in/portal/web/home/auctions
- బ్యాంక్ ఆప్ బరోడా (BOB) Auctions
వెబ్సైట్- https://www.bankofbaroda.in/bank-auction
- యూనియన్ బ్యాంక్ ఆప్ ఇండియా (UBI) Auctions
వెబ్సైట్- https://www.unionbankofindia.co.in/English/Foreclosure.aspx
లోన్ సౌకర్యం కూడా..
Second Hand Car Finance Options : మీరు వెబ్సైట్ల ద్వారా కారును తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. అయితే ఈ మొత్తాన్ని కూడా మీరు ఏర్పాటు చేసుకోలేకపోతే ఆయా వెబ్సైట్ కంపెనీలు లోన్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాయి. ఈ సౌలభ్యంతో మీరు మెచ్చిన కారును కొనుగోలు చేయవచ్చు.
Gold Rate Today 26th October 2023 : హైదరాబాద్, విజయవాడలో బంగారం ధర ఎంతంటే?
Car Subscription Model : కారు కొనకుండా హ్యాపీగా తిరగాలా?.. సబ్స్క్రిప్షన్ ఆప్షన్ గురించి తెలుసా?