ETV Bharat / business

Cheapest Prepaid Plans : బెస్ట్​ ఇయర్లీ ప్రీపెయిడ్​ ప్లాన్స్ .. అన్​లిమిటెడ్​ బెనిఫిట్స్​ కూడా!

author img

By

Published : Jul 28, 2023, 4:42 PM IST

Best Prepaid Plans 2023 : మీరు బెస్ట్ అండ్​ చీపెస్ట్​ ప్రీపెయిడ్ ప్లాన్​ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. బీఎస్​ఎన్​ఎల్ తన వినియోగదారుల కోసం రెండు బడ్జెట్​ ఫ్రెండ్లీ ప్రీ-పెయిడ్​ ప్లాన్స్​ తీసుకొచ్చింది. 365 రోజులు, 366 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చిన ప్లాన్స్​ ద్వారా.. వాయిస్​ కాల్స్, ఇంటర్​ నెట్​ డేటా, SMS బెనిఫిట్స్​ అందిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..

Cheapest BSNL Prepaid Plans 2023
BSNL cheapest year long Prepaid plan As of July End

BSNL Prepaid Recharge Plans : భారత్​ సంచార్​ నిగమ్ లిమిటెడ్​ (బీఎస్​ఎన్​ఎల్) తన వినియోగదారుల కోసం​ రెండు సరికొత్త బడ్జెట్​ ప్లాన్​ల​ను తీసుకొచ్చింది. ముఖ్యంగా 365 రోజుల వ్యాలిడిటీతో ఒక ప్లాన్​, 366 రోజుల వ్యాలిడిటీతో మరో ప్లాన్​ను తీసుకొచ్చింది. వీటి ద్వారా బీఎస్​ఎన్ఎల్​ వినియోగదారులకు వాయిస్​ కాల్స్​, ఇంటర్​నెట్​ డేటా, ఎస్​ఎంఎస్​ ప్రయోజనాలు అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న మిగతా టెలికాం కంపెనీలు అందిస్తున్న అన్ని యాన్యువల్​ ప్లాన్స్​ కంటే వీటి ధర చాలా తక్కువ కావడం విశేషం.

రూ.1198 బీఎస్​ఎన్​ఎల్​ ప్లాన్​
BSNL Plan Voucher 1198 : బీఎస్​ఎన్​ఎల్​ రూ.1198లకు 365 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్​ను అందిస్తోంది. దీని ద్వారా చందాదారులు సంవత్సరమంతా బీఎస్​ఎన్​ఎల్​ ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా ఈ ప్లాన్​ తీసుకున్న యూజర్లు 300 నిమిషాల పాటు ఎనీ-నెట్​ వాయిస్​ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు 3జీబీ వరకు నెలవారీ హైస్పీడ్​ డేటా పొందుతారు. అలాగే యూజర్లు నెలకు 30 ఎస్​ఎంఎస్​లు వరకు ఉపయోగించుకోవచ్చు. వాస్తవానికి హోమ్ లొకేషన్​లో ఈ ప్లాన్​ ప్రయోజనాలపై ఎలాంటి పరిమితి లేదు. కానీ నేషనల్​ రోమింగ్​ ఛార్జీలు మాత్రం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ముంబయి, దిల్లీ లాంటి MTNL ఏరియాల్లోనూ అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

వ్యాలిడిటీ కలుస్తుంది!
BSNL 1198 plan details : ఒక బీఎస్​ఎన్​ఎల్​ యూజర్​ రూ.1198లతో రీఛార్జ్​ చేసుకున్నాడని అనుకుందాం​. ఒక వేళ అతను ఈ ప్లాన్​ వ్యాలిడిటీ పూర్తికాకుండానే.. మరోసారి ఇంతే మొత్తానికి రీఛార్జ్ చేసుకున్నాడని అనుకుందాం. అప్పుడు కూడా యూజర్ ఎలాంటి నష్టానికి గురికాడు. ఎందుకంటే వ్యాలిడిటీ అక్యుములేషన్​ జరిగి.. అతను పూర్తి కాలం పాటు బీఎస్​ఎన్​ఎల్​ సేవలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది.

పరిమితి ఉంది!
BSNL 1198 plan limits : వాస్తవానికి రూ.1198 బీఎస్​ఎన్​ఎల్ ప్రీపెయిడ్​​ ప్లాన్​లో వాయిస్​ కాలింగ్​పై పరిమితి ఉంది. అలాకాకుండా మీరు పూర్తి స్థాయిలో వాయిస్​ కాలింగ్​ సదుపాయం కావాలనుకుంటే.. అప్పుడు మీరు రూ.1499 బీఎస్​ఎన్​ఎల్ ప్రీపెయిడ్​​ ప్లాన్​ను​ ఎంచుకోవాల్సి ఉంటుంది.

రూ.1499 బీఎస్​ఎన్​ఎల్​ ప్లాన్​!
BSNL Plan Voucher 1499 : ఈ ప్లాన్​ వ్యాలిడిటీ 366 రోజులు. దీని ద్వారా యూజర్లు అన్​లిమిటెడ్​ వాయిస్​ కాలింగ్​ సదుపాయాన్ని పొందుతారు. దీనితో పాటు చందాదారులకు 366 రోజుల పాటు రోజుకు 100 ఎస్​ఎంఎస్​లు చొప్పున లభిస్తాయి. 24 జీబీ హైస్పీడ్​ ఇంటర్​నెట్​ డేటా కూడా ఏకమొత్తంగా లభిస్తుంది.

బీఎస్​ఎన్​ఎల్ వినియోగదారులు ఈ ప్రీపెయిడ్​ ప్లాన్​లను BSNL అధికారిక వెబ్​సైట్ ద్వారా పొందవచ్చు. లేదా బీఎస్​ఎన్​ఎల్​ మొబైల్​ యాప్​, అథరైజ్డ్​ రిటైలర్స్​, ఆన్​లైన్​ రీఛార్జ్​​ ప్లాట్​ఫారమ్స్​ల ద్వారా రీఛార్జ్​ చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.