ETV Bharat / business

90 రోజుల వ్యాలిడిటీతో BSNL సూపర్​ ప్లాన్​.. వాయిస్​ కాల్స్​కు మాత్రమే ఛాన్స్​!

author img

By

Published : Jun 17, 2023, 2:31 PM IST

BSNL 90 days plan : బీఎస్ఎన్​ఎల్​ వినియోగదారులకు గుడ్​ న్యూస్​. వాయిస్ కాలింగ్​ సదుపాయం మాత్రమే కావాలనుకునే యూజర్ల కోసం రూ.439 ప్రీపెయిడ్ ప్లాన్​ను బీఎస్​ఎన్​ఎల్​ తీసుకొచ్చింది. 90 రోజుల వాలిడిటీ ఉన్న ఈ ప్లాన్​తో వినియోగదారులు ఎలాంటి ఆటంకం లేకుండా వాయిస్​ కాలింగ్​ చేసుకోవచ్చు. ఈ బెస్ట్​ ప్లాన్​ వివరాలు మీ కోసం..

BSNL 90 days plan
BSNL voice only calling prepaid plan

BSNL 90 days plan : డేటా సెంట్రిక్​ ప్రీపెయిడ్​ ప్లాన్​లకు మంచి గిరాకీ ఉన్న ఈ కాలంలో.. బీఎస్​ఎన్​ఎల్​ ఓ సరికొత్త ప్రీపెయిడ్​ ప్లాన్​ను తీసుకొచ్చింది. వాయిస్ కాలింగ్​కు ప్రాధాన్యత కల్పిస్తూ రూ.439 ప్రీపెయిడ్​ ప్లాన్​ను తీసుకొచ్చింది. 90 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్​లో ఎలాంటి డేటాను ఇవ్వడం లేదు. కానీ 300 మెసేజ్​లు పంపించుకోవడానికి అవకాశం కల్పిస్తోంది.

టార్గెట్​ యూజర్ల కోసం
భారత్​ సంచార్​ నిగమ్ లిమిటెడ్​.. టార్గెట్​ యూజర్ల కోసం ఈ సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్​ను తీసుకొచ్చింది. డేటాను ఎక్కువగా ఉపయోగించని వారు.. ముఖ్యంగా పెద్దవారికి ఈ ప్రీపెయిడ్​ ప్లాన్​ మంచి ఎంపిక అవుతుంది. దీనిలో ఎలాంటి హిడెన్​ ఛార్జెస్​ కానీ, అనవరసమైన నిబంధనలు కానీ లేవు. ప్రస్తుతం మార్కెట్​లో ఈ సరికొత్త ప్లాన్​కు సరిసమానమైన మంచి ప్లాన్స్​ లేవని మార్కెట్​ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

త్వరలోనే దేశమంతటా 4జీ
బీఎస్​ఎన్​ఎల్​ త్వరలోనే దేశవ్యాప్తంగా 4జీ నెట్​వర్క్​ను విస్తరింపజేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం బాగా రెవెన్యూ వస్తున్న ఏరియాల్లో మాత్రమే బీఎస్​ఎన్ఎల్​ 4జీ సేవలు అందిస్తోంది. కానీ త్వరలోనే దేశవ్యాప్తంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

జియో నుంచి 2 ప్రీపెయిడ్ ప్లాన్స్​
JIO pre paid plans : రిలయన్స్​ జియో మరో రెండు కొత్త ప్రీపెయిడ్​ ప్లాన్స్ తీసుకొచ్చింది. 90 రోజుల వ్యాలిడిటీతో రూ.749, రూ.899 విలువ గల ప్రీపెయిడ్​ ప్లానులు తీసుకొచ్చింది. హెవీ డేటా యూజర్లకు ఇవి మంచి ఎంపికలు అవుతాయి.

  • రూ.749 ప్రీపెయిడ్ ప్లాన్​ 90 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. ఇందులో ప్రతి రోజు 2జీబీ డేటా, 100 ఎస్​ఎంఎస్​లు అలాగే అపరిమితమైన వాయిస్​ కాలింగ్​ సదుపాయాలు కల్పిస్తోంది. వీటితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్​, జియో సెక్యూరిటీలను కూడా ఉచితంగా ఇస్తోంది. అయితే డేటా లిమిట్ పూర్తయిన తరువాత ఇంటర్నెట్​ స్పీడ్​ 64కేబీపీఎస్​కు తగ్గిపోతుంది. రిలయన్స్​ జియో ఈ ప్లాన్ తీసుకున్నవారికి కూడా రిలయన్స్​ జియో వెల్​కమ్​ ఆఫర్​ను అందిస్తోంది. దీని ద్వారా అపరిమితమైన 5జీ డేటాను యూజర్లు వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తోంది.
  • రూ.899 ప్రీపెయిడ్​ ప్లాన్​ కూడా రూ.749 ప్లాన్​లానే ఉంటుంది. కానీ దీనిలో ప్రతి రోజు 2.5జీబీ డేటాను వాడుకోవచ్చు. మిగతా ఫీచర్లు అన్నీ ఒకేలా ఉంటాయి. రోజూ 100 మెసేజ్​లు పంపించవచ్చు. అలాగే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్​, జియో సెక్యూరిటీలను కూడా ఉచితంగా పొందవచ్చు. వీటితో పాటు రిలయన్స్​ జియో వెల్​కమ్​ ఆఫర్​ ద్వారా అపరిమితమైన 5జీ సేవలు పొందవచ్చు.

ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న వొడాఫోన్​, భారతీ ఎయిర్​టెల్​ ప్లాన్స్​తో పోల్చుకుంటే.. జియో తెచ్చిన ఈ రెండు ప్లాన్లు చౌక అని చెప్పకతప్పదు. దీనితో పాటు అపరిమిత 5జీ డేటాను కూడా వినియోగించుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.