ETV Bharat / business

కార్లకు స్టార్ రేటింగ్​.. సేఫ్టీ చెకింగ్ కోసం భారత్ ఎన్​క్యాప్​.. ఎప్పటి నుంచో తెలుసా? - భారత్ న్యూ కార్ అసెస్​మెంట్ ప్రోగ్రామ్

Bharat New Car Assessment Programme : కార్లలో ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను పరీక్షించి సేఫ్టీ రేటింగ్ ఇచ్చే కొత్త విధానం బారత్ ఎన్​క్యాప్​ను మంగళవారం ప్రకటించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.

Bharat New Car Assessment Programme
Bharat New Car Assessment Programme
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2023, 9:59 PM IST

Bharat New Car Assessment Programme : ప్రజలకు భద్రత, నాణ్యత, కాలుష్యంపై అవగాహన పెరిగిందని, వాటికి సంబంధించి ఏదైనా కొత్త విధివిధానాలు అమలు చేస్తే.. పాటించేందుకు వారు సిద్ధంగా ఉన్నారన్నారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ. కార్లలో ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను పరీక్షించి సేఫ్టీ రేటింగ్‌ ఇచ్చే కొత్త విధానం భారత్‌ ఎన్‌క్యాప్‌ను (Bharat NCAP/BNCAP - Bharat New Car Assesment Programme)ను ఆయన మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా భారత్‌ ఎన్‌క్యాప్‌ లోగో, స్టిక్కర్‌ను విడుదల చేశారు.

'గతంలో కార్ల సేఫ్టీ పరీక్షలకు అవసరమైన క్రాష్‌ టెస్ట్‌ కోసం దేశీయ ఆటోమొబైల్‌ కంపెనీలు విదేశాల్లో రూ.2.50 కోట్లు ఖర్చు పెట్టేవి. కానీ, ప్రస్తుతం దేశీయంగా ఈ విధానం రూ.60 లక్షలకే అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా దేశీయ ఆటోమొబైల్‌ తయారీ సంస్థలకు క్రాష్‌ టెస్ట్‌కు అయ్యే ఖర్చు భారీగా తగ్గుతుంది. అక్టోబరు 1 నుంచి ఈ విధానం అందుబాటులోకి వస్తుంది. ఇందులో సైడ్‌ ఇంపాక్ట్‌ టెస్ట్‌ (కారు కుడి లేదా ఎడమవైపు), ఫ్రంట్‌ ఇంపాక్ట్‌ టెస్ట్‌ (కారు ముందు), పోల్‌ సైడ్‌ ఇంపాక్ట్‌ టెస్టులు ఉంటాయి. ఇప్పటికే భారత్‌ ఎన్‌క్యాప్‌ విధానం ద్వారా పరీక్షించేందుకు దేశీయ కార్ల తయారీ సంస్థలు 30కిపైగా కార్లను ఇచ్చాయి. ఇది పూర్థిస్థాయిలో పనిచేయడం ప్రారంభమైన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలతోపాటు ఎలక్ట్రిక్‌ వాహనాలకు కూడా భద్రతా పరీక్షలు చేసి రేటింగ్‌ ఇస్తాం. ఇవి రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతాన్ని తగ్గించడమే కాకుండా.. వినియోగదారులకు సురక్షితమైన కార్లను అందించాలనే లక్ష్యంతో భారత్‌ ఎన్‌క్యాప్‌ను తీసుకొచ్చాం.' అని గడ్కరీ చెప్పారు.

భారత్‌ ఎన్‌క్యాప్‌లో కార్లను ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ స్టాండర్డ్‌ (AIS) 197 ప్రకారం పరీక్షిస్తారు. అడల్ట్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌ (AOP - పెద్దల భద్రత), ఛైల్డ్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌ (COP - పిల్లల భద్రత)కు ఎలాంటి ప్రమాణాలు పాటించారనేది ఈ క్రాష్‌ టెస్ట్‌లో చెక్ చేస్తారు. ఈ క్రాష్‌ టెస్ట్‌లో ఐదు భద్రతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు.

  1. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కారును డిజైన్‌ చేశారా? లేదా?
  2. కారులో ప్రయాణించే పెద్దల భద్రతకు ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
  3. ప్రమాదాలు జరిగినప్పుడు పిల్లల భద్రతకు ఇస్తున్న ఫీచర్లు ఏంటి?
  4. పాదచారులను కారు ఢీకొన్నప్పుడు వారిపై ఎంత మేర ప్రభావం ఉంటుంది?
  5. భద్రత కోసం కారులో ఎలాంటి సాంకేతికతను ఉపయోగించారు?

భారత్‌ ఎన్‌క్యాప్‌ పరీక్షల కోసం ఆటోమొబైల్‌ సంస్థలు కార్లను స్వచ్ఛందంగా అందిచొచ్చు. లేదా, మార్కెట్లోకి విడుదలైన కొత్త కార్లను పరీక్షల కోసం షోరూమ్‌ల నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ తీసుకుంటుంది. క్రాష్‌ టెస్ట్‌ అనంతరం కార్ల స్టార్‌ రేటింగ్ వివరాలను భారత్‌ ఎన్‌క్యాప్‌ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

కేంద్రం కొత్త రూల్​.. ఇకపై లారీ క్యాబిన్​లో AC మస్ట్​!

కార్లకు ఇకపై 'స్టార్​ రేటింగ్స్'.. కేంద్రం కొత్త రూల్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.