Best Mileage Bike Under 1 Lakh : నేటి కాలంలో బస్సులు, ఆటోలు లాంటి వాహనాల్లో షేరింగ్ చేసుకుంటూ ప్రయాణించడం చాలా కష్టం అయిపోతోంది. పైగా టికెట్ ధరలు కూడా రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. అందుకే చాలా మంది అందుబాటు ధరలో, మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ కొనేందుకు ఇష్టపడుతున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ టూ-వీలర్ కంపెనీలు అన్నీ మంచి స్టైలిష్ లుక్స్‌తో, అదిరిపోయే ఫీచర్స్, స్పెక్స్‌తో.. ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్‌లను తక్కువ ధరలో అందుబాటులోకి తెస్తున్నాయి. వాటిలోని టాప్ -10 బైక్స్‌ను ఇప్పుడు చూద్దాం.
Hero Splendor Plus XTEC Features : హీరో స్ల్పెండర్ ప్లస్ XTEC బైక్‌లో 97 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 8000 rpm వద్ద 8.02 Ps పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లో 9.8 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ లీటర్‌కు ఏకంగా 95.8 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
Hero Splendor Plus XTEC Price : మార్కెట్లో ఈ హీరో స్ల్పెండర్ ప్లస్ XTEC బైక్ ధర సుమారుగా రూ.80,511 వరకు ఉంటుంది.
Hero Splendor Plus Features : ఈ హీరో స్ల్పెండర్ ప్లస్ బైక్‌లోనూ 97 సీసీ ఇంజిన్‌ను ఏర్పాటు చేశారు. ఇది 8000 rpm వద్ద 8.02 Ps పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లోనూ 9.8 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ లీటర్‌కు 80.6 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
Hero Splendor Plus Price : మార్కెట్లో ఈ హీరో స్ల్పెండర్ ప్లస్ బైక్ ధర రూ.75,891 నుంచి రూ.77.026 వరకు ఉంటుంది.
Bajaj Platina 110 Features : బజాజ్ ప్లాటినా 110 బైక్‌లో 115 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 7000 rpm వద్ద 8.60 Ps పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లోనూ 10.5 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ లీటర్‌కు 70 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
Bajaj Platina 110 Price : బజాజ్ ప్లాటినా బైక్ రూ.71,174 నుంచి రూ.80,525 ప్రైజ్ రేంజ్లో ఉంటుంది.
TVS Sport Features : టీవీఎస్ స్పోర్ట్ బైక్‌లో 109 సీసీ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇది 7350 rpm వద్ద 8.29 Ps పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లోనూ 10 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ లీటర్‌కు 70 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
TVS Sport Price : మార్కెట్లో టీవీఎస్ స్పోర్ట్ బైక్ ధర రూ.66,030 నుంచి రూ.71,220 మధ్య ఉంటుంది.
Bajaj CT 110X Features : బజాజ్ సీటీ 110 ఎక్స్ బైక్‌లో 115 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 7000 rpm వద్ద 8.6 Ps పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లోనూ 11 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ లీటర్‌కు 70 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
Bajaj CT 110X Price : బజాజ్ సీటీ 110 ఎక్స్ బైక్ ధర సుమారుగా రూ.69,075 వరకు ఉంటుంది.
Hero HF Deluxe Features : హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌లో 97 సీసీ ఇంజిన్‌ను ఏర్పాటు చేశారు. ఇది 8000 rpm వద్ద 8.02 Ps పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లోనూ 9.6 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ లీటర్‌కు 70 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
Hero HF Deluxe Price : మార్కెట్లో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ రూ.65,498- రూ.69,598 ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
Bajaj Platina 100 Features : బజాజ్ ప్లాటినా 100 బైక్‌లో 102 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 7500 rpm వద్ద 7.9 Ps పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లోనూ 11 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ లీటర్‌కు 70 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
Bajaj Platina 100 Price : బజాజ్ ప్లాటినా 100 బైక్ ధర సుమారుగా రూ.68,819 వరకు ఉంటుంది.
Hero HF 100 Features : హీరో హెచ్ఎఫ్ 100 బైక్‌లో 97 సీసీ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇది 8000 rpm వద్ద 8.02 Ps పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లోనూ 9.1 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ లీటర్‌కు 70 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
Hero HF 100 Price : హీరో హెచ్ఎఫ్ 100 బైక్ ధర సుమారుగా రూ.61,918 వరకు ఉంటుంది.
TVS Radeon Features : టీవీఎస్ రేడియన్ బైక్‌లో 109 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 7350 rpm వద్ద 8.19 Ps పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లోనూ 10 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ లీటర్‌కు 68.6 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
TVS Radeon Price : మార్కెట్లో టీవీఎస్ రేడియన్ బైక్ ధర రూ.74,125 నుంచి రూ.82,170 వరకు ఉంటుంది.
Hero Super Splendor XTEC Features : హీరో సూపర్ స్ల్పెండర్ XTEC బైక్‌లో 124 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 7500 rpm వద్ద 10.84 Ps పవర్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లోనూ 12 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. లీటర్‌కు 68 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
Hero Super Splendor XTEC Price : మార్కెట్లో హీరో సూపర్ స్ల్పెండర్ XTEC బైక్ ధర రూ.88,878 నుంచి రూ.93,078 మధ్య ఉంటుంది.
టాటా కార్ కొనాలా? 2024లో లాంఛ్ కానున్న 5 బెస్ట్ మోడల్స్ ఇవే!