ETV Bharat / business

2024లో లాంఛ్​ కానున్న టాప్​-6 ఫ్యామిలీ కార్స్ ఇవే! ధర ఎంతంటే? - List of Upcoming Cars in India 2024

Best Family Cars Launching Soon In Telugu : మీరు లేటెస్ట్ కారు కొనాలని అనుకుంటున్నారా? ఫ్యామిలీ మొత్తానికి ఉపయోగపడే కారు కావాలా? అయితే ఇది మీ కోసమే. త్వరలో మారుతి సుజుకి, టాటా, మహీంద్రా, టయోటా, కియా కంపెనీలు రూ.6 నుంచి రూ.10 లక్షల బడ్జెట్లో మంచి ఫీచర్స్ ఉన్న కార్లను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

upcoming family cars 2024
best Family Cars Launching Soon
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 1:15 PM IST

Best Family Cars Launching Soon : భారతదేశంలో నేడు ఫ్యామిలీ కార్లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా తమ కుటుంబ అవసరాల కోసం కార్లను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకునే.. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తక్కువ బడ్జెట్లో, మంచి ఫీచర్స్ ఉన్న కార్లను మార్కెట్​లోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా మారుతి సుజుకి, టాటా, మహీంద్రా, టయోటా, కియా లాంటి కంపెనీలు రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల ప్రైస్​ రేంజ్​లోని కార్లను త్వరలో ఇండియన్​ మార్కెట్​లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అందుకే వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

1. Maruti Suzuki Swift Features :
జపాన్ మొబిలిటీ షోలో మినీ కూపర్​ను గుర్తుకు తెచ్చే డిజైన్​తో మారుతి స్విఫ్ట్ కారును ప్రదర్శించారు. ఈ కార్​ ఫీచర్స్​ విషయానికి వస్తే.. కారు ముందు భాగంలో రీ డిజైన్ చేసిన గ్రిల్​తోపాటు ఇంటీరియర్, ఎక్స్​టీరియర్​లో కూడా అనేక మార్పులు చేశారు. ఈ కారులో స్ట్రాంగ్​ హైబ్రీడ్ టెక్నాలజీతో.. 1.2 లీటర్​ 3 సిలిండర్​ పెట్రోల్ ఇంజిన్​ను అమర్చారు. అందువల్ల ఈ కారు ఏకంగా 35 kmpl మైలేజ్ ఇస్తుందని సమాచారం.

Maruti Suzuki Swift
మారుతి సుజుకి స్విఫ్ట్​
Maruti Suzuki Swift
మారుతి సుజుకి స్విఫ్ట్​

Maruti Suzuki Swift Price : మారుతి సుజుకి స్విఫ్ట్​ కార్​ ధర రూ.6 లక్షల వరకు ఉండవచ్చు.

Maruti Suzuki Swift
మారుతి సుజుకి స్విఫ్ట్​

2. Maruti Suzuki Dzire Feature :
మారుతి సుజుకి కంపెనీ 2024లో స్విఫ్ట్​తో పాటు డిజైర్​ కార్​ను కూడా లాంఛ్ చేయనుంది. ఈ రెండు కార్లలోనూ స్ట్రాంగ్​ హైబ్రీడ్ టెక్నాలజీతో.. 1.2 లీటర్​ 3 సిలిండర్​ పెట్రోల్ ఇంజిన్​ను అమర్చారు. ఈ కార్లు ఏకంగా 35 kmpl మైలేజ్​ ఇస్తాయని తెలుస్తోంది. ఈ హ్యాచ్​బ్యాక్​-సెడాన్ కార్ల లోయర్​ వేరియంట్లు 1.2 లీటర్ డ్యూయెల్​జెట్​ పెట్రోల్​, సీఎన్​జీ పవర్​ట్రైన్​ ఆప్షన్లతో రానున్నాయి.

Maruti Suzuki Dzire
మారుతి సుజుకి డిజైర్​
Maruti Suzuki Dzire
మారుతి సుజుకి డిజైర్​

Maruti Suzuki Dzire Price : మారుతి సుజుకి డిజైర్​ కార్​ ధర రూ.6.5 లక్షల వరకు ఉండవచ్చు.

Maruti Suzuki Dzire
మారుతి సుజుకి డిజైర్​

3. Kia Sonet Facelift Features : ఈ కియా సోనెట్ కారు 2024లోనే లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారులో అడ్వాన్స్​డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్​ (ADAS) టెక్నాలజీ అమర్చారని సమాచారం. అంతేకాదు కారులోపల న్యూ డ్యాష్​బోర్డ్​, డ్యూయెల్​-స్క్రీన్​ సెటప్​, 360-డిగ్రీ కెమెరాలను కూడా పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ కియా సోనెట్​ కార్​ను 1.2 లీటర్​ పెట్రోల్​, 1.0 లీటర్​ టర్బో పెట్రోల్​, 1.5 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఆప్షన్లతో తీసుకురానున్నారు.

Kia Sonet
కియా సోనెట్​
Kia Sonet
కియా సోనెట్​

Kia Sonet Price : కియా సోనెట్​ ధర రూ.7.8 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.

Kia Sonet
కియా సోనెట్​

4. Mahindra XUV300 Features : మహీంద్రా కంపెనీ 2024 ప్రారంభంలోనే తన లేటెస్ట్ XUV300 కారును లాంఛ్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఇప్పటికే అగ్రెసివ్​గా రోడ్ టెస్ట్​లు చేస్తోంది. మహీంద్రా కంపెనీ ఈ నయా కారు డిజైన్​లో, ఫీచర్లలో పలుమార్పులు చేసింది. ముఖ్యంగా కారులో పనోరమిక్​ సన్​రూఫ్​ను ఏర్పాటుచేసింది. అంతేకాకుండా 6-స్పీడ్​ టార్క్ -​ కన్వర్టర్​ ఆటోమేటిక్ గేర్​ బాక్స్​, రీడిజైన్డ్​ డ్యాష్​బోర్డ్​, వైర్​లెస్​ ఫోన్​ ఛార్జర్​, వెంటిలేటెడ్ ఫ్రంట్​ సీట్స్​, డిజిటల్​ డ్రైవర్​ డిస్​ప్లేలను కూడా ఈ కారులో అమర్చింది. XUV700 డిజైన్​ ప్రేరణతో ఈ XUV300 కారును స్పోర్టియర్ డిజైన్​తో రూపొందించింది.

Mahindra XUV300
మహీంద్రా ఎక్స్​యూవీ 300
Mahindra XUV300
మహీంద్రా ఎక్స్​యూవీ 300

Mahindra XUV300 Price : ఈ మహీంద్రా ఎక్స్​యూవీ300 కారు ధర రూ.8 లక్షలు ఉండవచ్చు అని నిపుణుల అంచనా.

Mahindra XUV300
మహీంద్రా ఎక్స్​యూవీ 300

5. Tata Punch EV Features : 2023 చివరిలో టాటా కంపెనీ.. పంచ్ ఈవీ కారును లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కారు పలుమార్లు రోడ్ టెస్టింగ్​ చేస్తున్నప్పుడు కనిపించింది. ఈ ఎలక్ట్రికల్​ మైక్రో ఎస్​యూవీ కారును.. మీడియం రేంజ్​, లాంగ్ రేంజ్​ అనే రెండు వేరియంట్లలో తీసుకువచ్చేందుకు టాటా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ కార్లలోని బ్యాటరీలను ఒకసారి ఫుల్ రీఛార్జ్​ చేస్తే 200 కి.మీ, 300 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

Tata Punch EV Price : టాటా పంచ్ ఈవీ కారు ధర రూ.10 లక్షల వరకు ఉండవచ్చు.

tata punch EV
టాటా పంచ్ ఈవీ

6. Toyota Taisor Features : టయోటా 2022లో అర్బన్ క్రూయిజర్​ను నిలిపివేసింది. దాని స్థానంలో ఇప్పుడు టైసర్ కారును తీసుకురానుంది. వాస్తవానికి ఈ కారు.. మారుతి సుజుకి ఫ్రాంక్స్​కు చెందిన రీ-బ్యాడ్జెడ్​ వెర్షన్​. టయోటా సిగ్నేచర్​ గ్రిల్​, ట్వీక్డ్​ బంపర్​లు, ప్రత్యేకమైన వీల్స్​తో ఇది చూడడానికి సూపర్​ స్టైలిష్ లుక్​లో ఉంటుంది. టయోటా ఈ టైసర్ కారు ఇంటీరియర్​లోనూ, కలర్​ స్కీమ్​లోనూ సరికొత్త మార్పులు చేస్తోంది. అంతేకాదు ఈ కారును 1.2 లీటర్​ పెట్రోల్​ మోటార్​, 1.0 లీటర్​ టర్బో-పెట్రోల్ మోటార్ ఆప్షన్లతో తీసుకువస్తోంది.

Toyota Taisor Price : ఈ టయోటా టైసర్​ కారు ధర సుమారుగా రూ.8 లక్షల వరకు ఉండవచ్చు.

Toyota Taisor
టయోటా టైసర్​

కాలేజ్ స్టూడెంట్స్ స్పెషల్​ - రూ.2 లక్షల​ బడ్జెట్లోని టాప్-10 బైక్స్ ఇవే!

లేడీస్​ స్పెషల్​ - రూ.1 లక్ష బడ్జెట్లో ఉన్న టాప్​-5 స్కూటీలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.