ETV Bharat / business

ఇకపై బ్యాంకులు వారానికి 5 రోజులే పనిచేస్తాయా? ప్రతి శనివారం సెలవా?

Bank Two Weekly Off : బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త! బ్యాంకులు త్వరలో వారానికి 5 రోజులు మాత్రమే పనిచేసే అవకాశం ఉందని సమాచారం. అప్పుడు ప్రతి శని, ఆదివారాలు సెలవు దినాలుగా ఉంటాయి. అయితే బ్యాంకు ఉద్యోగులు పని దినాల్లో మాత్రం అదనంగా 40 నిమిషాలపాటు పనిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఐబీఏ, యూఎఫ్​బీఈ ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.

bank weekly off new rules
bank two weekly off update
author img

By

Published : Jun 7, 2023, 1:16 PM IST

Bank Two Weekly Off Update : బ్యాంకు ఉద్యోగులు ఇకపై వారానికి 5 రోజులు అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేసే అవకాశం ఉంది. ది యునైటెడ్​ ఫోరమ్​ ఆఫ్​ బ్యాంక్​ ఎంప్లాయీస్​, ఐబీఏ (ఇండియన్​ బ్యాంక్స్​ అసోసియేషన్​) ఈ మేరకు ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందం మేరకు వారంలో 5 రోజులు మాత్రమే బ్యాంకు ఉద్యోగులు పని చేస్తారు. అయితే ఈ వర్కింగ్​ డేస్​లో మాత్రం అదనంగా కొంత సమయం వారు పనిచేయాల్సి ఉంటుంది.

"నెగోషియబుల్​ ఇన్​స్ట్రుమెంట్​ యాక్ట్​లోని సెక్షన్​ 25 ప్రకారం, ప్రభుత్వం కచ్చితంగా ప్రతి శనివారాన్ని సెలవు దినంగా ప్రకటించాల్సి ఉంది."
- ఎస్​. నాగరాజన్​, జనరల్​ సెక్రటరీ, ఆల్​ ఇండియా బ్యాంక్​ ఆఫీసర్స్​ అసోసియేషన్​

సెలవు దినాల విషయంలో రెండు బ్యాంకు యూనియన్లు ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ, ఇది బ్యాంకు ఉద్యోగుల జీతభత్యాలపై ఎలాంటి చర్చ జరగలేదని నాగరాజన్​ పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు అనే ప్రతిపాదనను ప్రభుత్వం, అలాగే ఆర్​బీఐ కచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఇంటర్​బ్యాంక్​ యాక్టివిటీస్​కు సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి.

అదనపు సమయం పనిచేస్తారు!
Bank working hours : ఒక వేళ వారానికి 5 రోజులు మాత్రమే బ్యాంకు ఉద్యోగులు పనిచేయాల్సి వస్తే, అప్పుడు వారు ప్రతి రోజూ అదనంగా 40 నిమిషాలపాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం 9:45 నుంచి 5:30 గంటల వరకు పనిచేయాల్సి వస్తుంది.

స్టాక్​ మార్కెట్ల టైమింగ్​తో అనుసంధానం కోసమే!
విదేశీ స్టాక్​ మార్కెట్​ల ట్రేడింగ్​ సమయాలతో, మన దేశీయ స్టాక్​ మార్కెట్​లు అనుసంధానం కావాలని చూస్తున్నాయి. అందుకు అనుగుణంగానే బ్యాంకులు కూడా తమ సమయాలను సర్దుబాటు చేసుకోవాలనే ప్రతిపాదన వచ్చింది.
ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులు ఒక శనివారం తప్పించి, మరో శనివారం పనిచేస్తున్నారు. ఇందువల్ల బ్యాంక్​ కస్టమర్లలో చాలా గందరగోళం నెలకొంటోంది. ముఖ్యంగా ఏ శనివారం బ్యాంకులు పనిచేస్తాయో వారు తెలుసుకోలేక సతమతమవుతున్నారు.

వారానికి 5 రోజులు మాత్రమే పని గురించి బ్యాంకు ఉద్యోగులు కూడా చాలా కాలం నుంచి పట్టుబడుతున్నారు. ముఖ్యంగా ఎల్ఐసీ ఐపీఓకు వచ్చే ముందు తమ కార్యాలయాల్లో కూడా 5 పనిదినాలను అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి బ్యాంకు ఉద్యోగుల్లో ఈ డిమాండ్​ మరింత పెరిగింది.

ఇంటర్నెట్​ బ్యాంకింగ్​ బాగా పెరిగింది.. కానీ..
ప్రస్తుతం మన దేశంలో మొబైల్ బ్యాంకింగ్​ బాగా పెరిగింది. చెప్పుకోదగిన స్థాయిలో ఏటీఎంలను బ్యాంకులు ఏర్పాటుచేశాయి. ఆన్​లైన్​ బ్యాంకింగ్​ బాగా వృద్ధి చెందింది. అయినప్పటికీ ఇప్పటికీ కొంత మంది కస్టమర్లు బ్యాంకు బ్రాంచులకు వెళ్లి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అందుకే బ్యాంకులు తమ కస్టమర్లకు క్యాష్​ డిపాజిటింగ్​ మెషిన్​ల పట్ల, పాస్​బుక్​ ప్రింటింగ్​ పరికరాల పట్ల మరింత అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
విశ్వసనీయ సమాచారం మేరకు, త్వరలోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, బ్యాంకు ఉద్యోగులు వారంలో 5 రోజులు మాత్రమే పనిచేసే ప్రతిపాదనను అంగీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.