ETV Bharat / business

వీడియోకాన్​ వ్యవస్థాపకుడు వేణుగోపాల్​ ధూత్​కు బెయిల్​.. సీబీఐకి షాక్​! - వీడియోకాన్​ ఐసీఐసీఐ బ్యాంక్ కేసు

బొంబాయి హైకోర్ట్​ వీడియోకాన్​ వ్యవస్థాపకుడు వేణుగోపాల్​ ధూత్​కు మధ్యంతర బెయిల్​ను మంజూరు చేసింది. రుణమోసం కేసులో నెలరోజుల క్రితం సీబీఐ ధూత్​ను అరెస్ట్​ చేయగా.. హైకోర్టు లక్షరూపాయల పూచీకత్తుతో బెయిల్​ ఇచ్చింది. ఈ కేసులో సీబీఐ తీరుపై మండిపడింది.

videocon ceo venugopal dhoot
వేణుగోపాల్​ ధూత్​
author img

By

Published : Jan 20, 2023, 2:04 PM IST

వీడియోకాన్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ ధూత్‌కు బొంబాయి హైకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఐసీఐసీఐ బ్యాంక్​ నుంచి మోసపూరితంగా రూ.3,250 కోట్ల రుణం తీసుకున్నారనే ఆరోపణతో.. వేణగోపాల్​ ధూత్​ను 2022 డిసెంబర్​ 26న సీబీఐ అరెస్ట్​ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్​ మాజీ సీఈఓ, ఎండీ చందా కొచ్చర్​, ఆమె భర్త దీపక్​ కొచ్చర్​ను కూడా డిసెంబర్ నెలలోనే సీబీఐ అరెస్ట్​ చేసింది. అయితే కొన్ని రోజుల క్రితం కొచ్చర్​ దంపతులకు హైకోర్ట్​ బెయిల్​ మంజూరు చేసింది. దీంతో ధూత్​ కూడా బెయిల్​ కోసం కోర్టును ఆశ్రయించారు. బొంబాయి హైకోర్టులోని డివిజన్​​ బెంచ్​​ ఆయనకు లక్షరూపాయల పూచీకత్తుతో బెయిల్​ ఇచ్చింది.

ధూత్​ అప్పీల్ ​కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి వీలులేకుండా స్టే విధించాలన్న సీబీఐ అభ్యర్థనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. ఇదే కేసులో అరెస్ట్​ అయి.. బెయిల్​పై బయటకు వచ్చిన కొచ్చర్​ దంపతుల బెయిల్​ ఉత్తర్వులను రీకాల్ చేయాలను కోరుతూ.. ఓ న్యాయవాది చేసిన ధరఖాస్తును కూడా కోర్టు కొట్టిపడేసింది. ఆ న్యాయవాది​కి రూ.25,000 జరిమానా విధించింది.

ఈ కేసులో ధూత్​ విచారణకు సహరించినందున ఆయన అరెస్ట్ అనవసరమని న్యాయవాది సందీప్​ లడ్డా కోర్టులో వాదించారు. "క్రిమినల్​ ప్రొసీజర్ కోడ్​ ప్రకారం ముందుగా విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు పంపాలి. అత్యవసరమైతే తప్ప అరెస్ట్ చేయకూడదు. కానీ, సీబీఐ ఏకపక్షంగా వ్యవహరించి చట్టవిరుద్ధంగా ప్రవర్తించింది" అని ధూత్​ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే.. ధూత్​ ఈ విచారణ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారని.. అందుకే ఆయన్ను అరెస్ట్​ చేసినట్లు సీబీఐ వాదించింది. జనవరి 13న ఇరువురి వాదనలు విన్న కోర్ట్ శుక్రవారం తన వాదనలో..​ ఏకపక్షంగా వ్యవహరించిన​ సీబీఐను మందలిస్తూ ధూత్​కు మధ్యంతర బెయిల్​ను మంజూరు చేసింది.

అసలేంటా కేసు..?
వీడియోకాన్‌ గ్రూపునకు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడినట్లు నమోదైన కేసులో విచారణ జరిపిన సీబీఐ.. 71 ఏళ్ల దూత్​తో పాటు కొచ్చర్​ దంపతులను అరెస్ట్​ చేసింది. వీడియోకాన్ గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈఓగా 2018లో చందా కొచ్చర్‌ వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2012లో బ్యాంకు సీఈవో హోదాలో రూ. 3,250 కోట్ల రుణం మంజూరు చేయగా.. అది ఎన్‌పీఏగా మారింది. తద్వారా కొచ్చర్​ కుటుంబం లబ్ధి పొందినట్లు సీబీఐ ఆరోపించింది. వేణుగోపాల్​ దూత్​ స్థాపించిన నూపవర్ రెన్యూవబుల్స్ కంపెనీలో దీపక్​ కొచ్చర్​ పెట్టుబుడులు పెట్టారని సీబీఐ ఆరోపించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.