ETV Bharat / business

Bal Jeevan Bima Yojana Scheme: చిన్నారులకు 'బీమా'.. రోజుకు రూ.6 ఇన్వెస్ట్​ చేస్తే.. రూ. లక్ష ఇన్సూరెన్స్‌..!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2023, 1:53 PM IST

Best Postal Insurance Policy for Childrens: జీవిత బీమా అంటే పెద్ద వాళ్లకే అనే భావనలో చాలా మంది ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. ఇండియన్‌ పోస్టాఫీస్‌ చిన్నారుల కోసం కూడా ఓ జీవిత బీమా పథకాన్ని తీసుకొచ్చింది. అదే బాల్ జీవన్‌ బీమా. ఇంతకీ ఈ పథకానికి ఎవరు అర్హులు.? పాలసీని ఎలా పొందాలి.? లాంటి పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

Etv Bharat
Etv Bharat

Bal Jeevan Bima Yojana Scheme Details: సంపాదిస్తున్న రూపాయిలో ఎంతో కొంత భవిష్యత్‌ కోసం దాచిపెట్టుకోవడం తప్పనిసరిగా మారింది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా వివాహం జరిగి.. పిల్లలు ఉన్నవారు కచ్చితంగా వారి భవిష్యత్ అవసరాల కోసం ప్రతి నెలా కొంత మొత్తంలో సేవింగ్స్ చేయాల్సిందే. పిల్లలు పెరిగి పెద్దవుతున్నప్పుడు, చదువుకోడానికి ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయి. వచ్చే కొంత ఆదాయంతో కుటుంబ పోషణకు సరిపోక పిల్లల చదువుల కోసం అప్పులు చేయాల్సి రావొచ్చు. అలాంటి వారు ఇప్పటి నుంచే పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించి ప్రతి నెలా కొంత మొత్తం డబ్బులు పొదుపు చేయడం మొదలు పెట్టండి. అయితే చిన్నారులకు ఉపయోగపడేలా పోస్టాఫీసు.. బాలా జీవన్​ బీమా పేరుతో ఓ పథకాన్ని ప్రవేశ పెట్టింది.

National Savings Certificate Vs Public Provident Fund : నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ Vs పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్.. ఏది బెస్ట్..?

Best Post Office Scheme for Childrens With Low Investment: బాల్ జీవన్ బీమా పథకంలో చేరాలనుకునేవారు పోస్టాఫీసులో ఖాతాను ఓపెన్ చేయాలి. ప్రతి రోజు కేవలం రూ.6 పెట్టుబడి పెట్టి.. మీ పిల్లలను లక్షాధికారిని చేయవచ్చు. అలాగే పిల్లల చదువు ఖర్చుల కోసం ముందుగానే డబ్బును పొదుపు చేసుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే తల్లిదండ్రుల వయసు 45 సంవత్సరాలు మించకూడదు. 5 నుంచి 20 సంవత్సరాల పిల్లల పేరుతో ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

Best Post Office Schemes With High Savings: పొదుపు కోసం ఏ పోస్టాఫీస్ పథకం మంచిది.. మీకు తెలుసా?

బాల్ జీవన్ బీమా పథకం పూర్తి వివరాలు..

Bal Jeevan Bima Scheme Details Telugu..

  • ఒక కుటుంబంలో కేవలం ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ పథకం ద్వారా ప్రయోజనం అందుతుంది.
  • ఈ పథకం తీసుకోవడానికి, పిల్లల వయస్సు 5 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండాలి
  • మెచ్యూరిటీ తేదీన కనీస హామీ మొత్తం ఒక లక్ష రూపాయలు అందుతుంది.
  • పాలసీని కొనుగోలు చేసే సమయంలో పాలసీదారు (తల్లి లేదా తండ్రి) వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు.
  • పాలసీ మెచ్యూరిటీకి ముందే పాలసీదారు మరణిస్తే, అటువంటి పరిస్థితిలో, ఇకపై పాలసీ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు.
  • పాలసీ గడువు ముగిసిన తర్వాత, పిల్లలకు పూర్తి మెచ్యూరిటీ మొత్తం ఇస్తారు.
  • పాలసీ ప్రీమియాన్ని తల్లిదండ్రులు చెల్లించాలి.
  • ఈ పాలసీ మీద రుణ ప్రయోజనం ఉండదు.
  • మీకు వద్దు అనుకుంటే, ఈ పథకాన్ని 5 సంవత్సరాల తర్వాత సరెండర్ చేయవచ్చు.
  • రూ. 1000 హామీ మొత్తం మీద ప్రతి సంవత్సరం రూ. 48 బోనస్ ఇస్తారు.

మీరు బాల్ జీవన్ బీమా యోజన పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ముందు సమీపంలోని పోస్ట్‌ ఆఫీస్‌కు వెళ్లండి. అక్కడ సంబంధిత అధికారులను సంప్రదించి స్కీమ్​కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి. అనంతరం అప్లికేషన్​ ఫామ్‌లో.. తమ పిల్లల గురించి పూర్తి వివరాలు తెలియజేయండి. అంతేకాకుండా పాలసీదారుడి వివరాలను కూడా అందించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్‌ను సమర్పించి.. ఖాతాను ఓపెన్ చేయండి.

Post Office Schemes Interest Rates : పోస్టాఫీస్​ పథకాల్లో మదుపు చేస్తున్నారా?.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే!

Kisan Vikas Patra : ఈ పోస్ట్ ఆఫీస్​ స్కీమ్​లో ఇన్వెస్ట్ చేస్తే.. మీ డబ్బులు డబుల్​!

పోస్ట్ ఆఫీస్ X స్టేట్ బ్యాంక్.. ఫిక్స్డ్​ డిపాజిట్​కు ఏది బెస్ట్? అధిక వడ్డీ ఎవరిస్తారు?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.