ETV Bharat / business

సిటీ బ్యాంక్‌ వ్యాపారం యాక్సిస్ చేతికి.. రూ.12,325 కోట్లకు డీల్‌ - అమెరికా దిగ్గజం సిటీ బ్యాంక్‌

Axis Bank citi bank: అమెరికా దిగ్గజం సిటీ బ్యాంక్‌కు చెందిన భారత వ్యాపారాన్ని రూ.12,325 కోట్లకు కొనుగోలు చేసినట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొనుగోలు ద్వారా సిటీ బ్యాంక్‌కు చెందిన 30 లక్షల మంది క్రెడిట్‌ కార్డు కస్టమర్లు యాక్సిస్‌ బ్యాంక్ వినియోగదారులు కానున్నారు.

Axis Bank Citi bank
యాక్సిస్‌ చేతికి సిటీ బ్యాంక్‌
author img

By

Published : Mar 31, 2022, 4:19 AM IST

Axis Bank citi bank: అమెరికా దిగ్గజం సిటీ బ్యాంక్‌కు చెందిన భారత వ్యాపారాన్ని (CONSUMER BUSINESS) కొనుగోలు చేసినట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. క్రెడిట్‌ కార్డు, రిటైల్‌ బ్యాంకింగ్‌, కన్జూమర్‌ లోన్‌, వెల్త్‌ మేనేజ్‌మెమెంట్‌ ఈ వ్యాపార విభాగంలో ఉన్నాయి. మొత్తం రూ.12,325 కోట్లకు కొనుగోలు చేసినట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొనుగోలు ద్వారా సిటీ బ్యాంక్‌కు చెందిన 30 లక్షల మంది క్రెడిట్‌ కార్డు కస్టమర్లు యాక్సిస్‌ బ్యాంక్ వినియోగదారులు కానున్నారు. క్రెడిట్‌ కార్డు పోర్ట్‌ఫోలియో 31 శాతం వృద్ధి చెందనుంది.

ఈ డీల్‌లో భాగంగా సిటీ బ్యాంక్‌ ఇండియాకు చెందిన 7 కార్యాలయాలు, 21 శాఖలు, 18 నగరాల్లో ఉన్న 499 ఏటీఎంలు యాక్సిస్‌ బ్యాంక్‌ సొంతం కానున్నాయి. కన్జూమర్‌ బ్యాంకింగ్‌లో పనిచేస్తున్న 3,600 మంది ఉద్యోగులు యాక్సిన్‌ బ్యాంక్‌ ఉద్యోగులుగా మారనున్నాయి. అంతర్జాతీయ వ్యూహంలో భాగంలో భారత్‌లో వినియోగదారు బ్యాంకింగ్‌ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు గతేడాది ఏప్రిల్‌లో సిటీ బ్యాంక్‌ ప్రకటించింది. 1902లో భారత్‌లోకి ప్రవేశించగా.. 1985లో బిజినెస్‌ను ప్రారంభించింది. వినియోగదారు వ్యాపారం నుంచి వైదొలిగిన సిటీ గ్రూప్‌.. ఇకపై ముంబయి, పుణె, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్‌ నుంచి గ్లోబల్‌ బిజినెస్‌పై దృష్టి సారించనుంది.

ఇదీ చదవండి: ఆధార్​-పాన్​ లింక్​ చేయలేదా? ఫైన్ తప్పదు! శుక్రవారమే మొదలు!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.