ETV Bharat / business

యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ వేతనంలో భారీగా కోత.. వారి అభిప్రాయం మేరకే..! - వేతనాన్ని తగ్గించుకున్న యాపిల్​ సీఈఓ

షేర్‌ హోల్డర్ల అభిప్రాయానికి అనుగుణంగా తన వేతనాన్ని తగ్గించుకునేందుకు టిమ్‌ కుక్‌ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. క్రితం ఏడాది టిమ్‌ కుక్‌ 99 మిలియన్‌ డాలర్ల పరిహారాన్ని అందుకున్నారు. దీన్ని 2023లో 49 మిలియన్‌ డాలర్లకు తగ్గించాలని నిర్ణయించారు.

apple ceo salary compensation
apple ceo salary compensation
author img

By

Published : Jan 13, 2023, 10:26 PM IST

అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ తన వేతనాన్ని తగ్గించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. దీనికి మార్చి 10న జరగనున్న ఇన్వెస్టర్‌ డేలో వాటాదారుల అనుమతి లభించాల్సి ఉంది. ఇప్పటికే షేర్‌హోల్డర్లకు పంపిన సమావేశ ముందస్తు ప్రతిపాదనల్లో కుక్‌ వేతన కోత అంశాన్ని కూడా చేర్చారు.

క్రితం ఏడాది టిమ్‌ కుక్‌ 99 మిలియన్‌ డాలర్ల పరిహారాన్ని అందుకున్నారు. దీన్ని 2023లో 49 మిలియన్‌ డాలర్లకు తగ్గించాలని నిర్ణయించారు. షేర్‌హోల్డర్ల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దీనికి కుక్‌ కూడా అంగీకరించినట్లు పేర్కొంది. 2022లో ఆయన 83 మిలియన్‌ డాలర్ల స్టాక్‌ అవార్డ్స్‌తో పాటు 12 మిలియన్‌ డాలర్ల ప్రోత్సాహకాలు, మూడు మిలియన్‌ డాలర్ల మూల వేతనం అందుకున్నారు. వీటితో పాటు రిటైర్‌మెంట్‌ ప్రణాళికలకు సంబంధించిన పరిహారం, భద్రత, వ్యక్తిగత విమాన ప్రయాణం వంటి సదుపాయాలతో పాటు విహారయాత్రల కోసం 46,000 డాలర్ల నగదును కూడా పొందారు.

షేర్‌హోల్డర్ల ఓటింగ్‌లో వచ్చిన స్పందనకు అనుగుణంగా కుక్‌ పరిహారాన్ని సర్దుబాటు చేసినట్లు కంపెనీ ఉన్నతోద్యోగుల వేతనాలను నిర్ణయించే కమిటీ తెలిపింది. వేతనాలపై క్రితం ఏడాది నిర్వహించిన 'సే-ఆన్‌-పే' ఓటింగ్‌లో 64 శాతం మంది వాటాదారులు మాత్రమే కుక్‌ వేతన ప్యాకేజీకి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొంది. 2019-2020లో 95 శాతం మంది సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం. కుక్‌ పనితీరును మాత్రం యాపిల్‌ బోర్డు ప్రశంసించింది. కంపెనీపై ఆయనకున్న దీర్ఘకాల వ్యూహాలపై సంపూర్ణ విశ్వాసం ఉన్నట్లు తెలిపింది.

కంపెనీ ఉన్నతోద్యోగుల వేతనాలకు సంబంధించి సంస్థాగత వాటాదారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. కుక్‌ పరిహార ప్యాకేజీని తగ్గించాలని వారంతా నిర్ణయించుకున్నట్లు దాన్నే ఓటింగ్‌ రూపంలో తెలియజేశారని పేర్కొంది. ఈ నేపథ్యంలో కంపెనీ వేతన కమిటీ సంస్థాగత వాటాదారులతో చర్చలు జరిపింది. వాటి ఆధారంగానే కుక్‌ పరహార ప్యాకేజీలో మార్పులు చేసినట్లు పేర్కొంది. అలాగే రిటైర్‌మెంట్‌ నాటికి లభించే స్టాక్‌ అవార్డ్స్‌ పరిమాణాన్ని సైతం తగ్గించాలని నిర్ణయించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.