ETV Bharat / business

భారత్​లో 1000 మంది అమెజాన్‌ ఉద్యోగుల తొలగింపు.. పరిహారంగా 5 నెలల జీతం!

Amazon Layoffs India : ఆర్థిక మాంద్యం భయాలతో పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా దిగ్గజ ఈ-కామర్స్​ సంస్థ అమెజాన్.. భారత్​లో దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. తొలగించిన ఉద్యోగులకు ఐదు నెలల జీతాన్ని పరిహారంగా ఇస్తామని అమెజాన్‌ ఈ-మెయిల్‌లో పేర్కొన్నట్లు సమాచారం.

amazon employee layoffs
అమెజాన్
author img

By

Published : Jan 13, 2023, 7:45 AM IST

Amazon Layoffs India : ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో కార్పొరేట్ సంస్థలు ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ ప్రభావం భారత్‌లోని ఉద్యోగులపై కూడా పడుతోంది. తాజాగా అమెజాన్‌ సంస్థ భారత్‌లో సుమారు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. జనవరి 18 నుంచి బెంగళూరు, గుడ్‌గావ్‌ కార్యాలయాల్లోని టెక్‌, మానవవనరులతోపాటు ఇతర విభాగాల్లో ఈ తొలగింపు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు తొలగింపు సమాచారాన్ని ఈ-మెయిల్‌ ద్వారా తమకు తెలియజేసినట్లు కొందరు ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. తొలగించిన ఉద్యోగులకు ఐదు నెలల జీతాన్ని పరిహారంగా ఇస్తామని అమెజాన్‌ ఈ-మెయిల్‌లో పేర్కొన్నట్లు వాళ్లు చెబుతున్నారు.

అమెజాన్‌ నుంచి తొలగింపు సమాచారం అందుకున్న ఉద్యోగులు తమ విభాగాధిపతులతో సమావేశం కావాలని సూచించినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఉద్యోగుల తొలగింపుపై అమెజాన్‌ సీఈవో ఆండీ జస్సీ స్పందించారు. "గత కొన్నేళ్లుగా కంపెనీ ఎక్కువ నియామకాలు చేపట్టింది. ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నాం" అని తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే అమెజాన్‌ అమెరికాలో 18,000, బ్రిటన్‌లో 1,200 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది.

కరోనా సమయంలో ఈ-కామర్స్‌ వ్యాపారం బాగా పుంజుకోవడం వల్ల అమెజాన్‌ భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొని వ్యాపారం నెమ్మదించడం వల్ల ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. గత మూడు నెలలుగా దిగ్గజ సంస్థలు ఉద్యోగాల కోత ప్రక్రియను చేపడుతున్నాయి. ట్విట్టర్​, మెటా వంటి సంస్థలు ఇప్పటికే లేఆఫ్‌లు ప్రకటించగా, ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఆరు శాతం మంది తొలగించనున్నట్లు గూగుల్ ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.