ETV Bharat / business

అమెజాన్ 'ఫ్రీడమ్​ సేల్​'.. వాటిపై 75 శాతం వరకు డిస్కౌంట్​! - అమెజాన్​ ఫ్రీడమ్​ సేల్​ ఆఫర్లు

Amazon Great Freedom Festival Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ తేదీలు వచ్చేశాయి. ఆగస్టు నెలలో ఐదు రోజుల పాటు ఈ సూపర్​ సేల్‌ జరగనుంది. ఆ​ తేదీలతో పాటు ఏ కేటగిరీ ప్రొడక్టులపై ఎంత శాతం డిస్కౌంట్లు ఉండనున్నాయో అమెజాన్ వెల్లడించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

Amazon Great Freedom Festival Sale:
Amazon Great Freedom Festival Sale:
author img

By

Published : Aug 5, 2022, 5:26 PM IST

Amazon Great Freedom Festival Sale: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరో సేల్‌ నిర్వహించేందుకు రెడీ అయింది. ప్రైమ్ డే సేల్‌ ముగిసి వారమే కాగా.. మరో ధమాకాను ప్రకటించింది. ఆగస్టు 15న 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరిట సేల్‌ను నడపనుంది అమెజాన్​. ఈ సేల్‌ తేదీలతో పాటు ఏ ప్రొడక్ట్​లపై ఎంత మేర డిస్కౌంట్​ ఇవ్వనుందో అమెజాన్ ప్రకటించింది. ఆ పూర్తి వివరాలు ఇవే.

ఆగస్టు 6 నుంచి 10వ తేదీ వరకు గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ జరగనుంది. అంటే మొత్తంగా ఐదు రోజుల పాటు యూజర్లందరికీ ఈ సేల్‌ అందుబాటులోకి వస్తుంది. అయితే ప్రైమ్ మెంబర్లకు ఒకరోజు ముందుగానే అందుబాటులోకి ఈ సేల్​ రానుంది. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు 5వ తేదీ నుంచే సేల్‌ను యాక్సెస్ చేయవచ్చు. సాధారణ యూజర్లందరికీ 6వ తేదీన సేల్​ ప్రారంభమవుతుంది. ఎస్​బీఐ క్రెడిట్ కార్డుతో ప్రొడక్టులను కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చని అమెజాన్​ తెలిపింది.

డిస్కౌంట్ల వివరాలు ఇలా..
గ్రేట్​ ఫ్రీడమ్ ఫెస్టివల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు డిస్కౌంట్లు ఇవ్వనున్నట్టు అమెజాన్ ప్రకటించింది. బెస్ట్ సెల్లింగ్, పాపులర్ మొబైళ్లపై కూడా ఆఫర్లు ఉంటాయని తెలిపింది. వన్‌ప్లస్‌, షావోమీ, సామ్‌సంగ్‌, ఐకూ, రియల్‌మీ, యాపిల్‌తో పాటు దాదాపు అన్ని కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లు ఉంటాయని చెప్పింది.

  • ఎలక్ట్రానిక్స్, యాక్ససరీస్​, హెడ్​ఫోన్స్​పై 75 శాతం వరకు డిస్కౌంట్
  • ల్యాప్‌టాప్‌లపై 40 శాతం వరకు తగ్గింపు
  • ట్యాబ్స్‌పై 45 శాతం డిస్కౌంట్​
  • స్మార్ట్‌వాచ్‌లపై 70శాతం వరకు తగ్గింపు
  • గృహోపకరణాలపై 60 శాతం తగ్గింపు
  • స్మార్ట్‌టీవీలపై 50 శాతం వరకు డిస్కౌంట్

అమెజాన్ బ్రాండ్ ప్రొడక్టులపైనా భారీ డిస్కౌంట్​.. అమెజాన్ బ్రాండ్ ప్రొడక్టులపై 70 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని ప్రకటించింది. ముఖ్యంగా అమెజాన్ బేసిక్స్ స్మార్ట్ టీవీలు, ఏసీలపై భారీ ఆఫర్లు ఉండనున్నాయి. వీటితో పాటు చాలా ప్రొడక్టులు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్‌లో ఆఫర్లతో అందుబాటులోకి రానున్నాయి.

ఇవీ చదవండి: 5జీ ఫోన్‌ కొనాలా? ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే మీ డబ్బులు వేస్ట్!

మరణించిన వారి 'సోషల్​ మీడియా' ఖాతాల్లో పోస్టులు ఏమవుతాయి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.