Amazon Black Friday Sale 2023 in Telugu: దసరా, దివాళీ తర్వాత అమెజాన్ (Amazon) ప్రకటించిన "అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2023" (Amazon Black Friday Sale 2023), సైబర్ మండే సేల్ (Amazon Cyber Monday Sale ) ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 17 నుంచి ప్రారంభమైన ఈ సేల్.. నవంబర్ 27న ముగియనుంది.
Black Friday Sale 2023 in India: అమెరికాలో ప్రతి ఏటా "బ్లాక్ ఫ్రైడే" పేరుతో సేల్ నిర్వహిస్తుంటారు. క్రిస్‌మస్, బ్లాక్ ఫ్రైడే అమ్మకాలు అక్కడ ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ "బ్లాక్ ఫ్రైడే సేల్" ఇప్పుడు భారత్‌లోనూ అనౌన్స్ చేశారు. ఈ సేల్‌లో భాగంగా.. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇయర్ ఫోన్స్ తదితర ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ వస్తువులతోపాటు.. దుస్తులు, పర్నిచర్, కిచెన్ సామగ్రి వంటి అన్ని కేటగిరీలపైనా డిస్కౌంట్ కొనసాగుతోంది. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు, ఫర్నిచర్‌పై 75 శాతం వరకు ఆఫర్ లభిస్తోంది.
Best Offers on Smart Phones in Amazon Black Friday Sale 2023: సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఆపిల్ వాచ్ 9 సిరీస్‌పై.. ఈ సేల్‌లో గరిష్ట తగ్గింపు ప్రకటించింది అమెజాన్. శాంసంగ్ నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్లపైనా భారీ ఆఫర్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎ54, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎ53, శాంసంగ్ గెలాక్సీ ఎ23 వంటి ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించింది.
Best Offers on Tablets in Amazon Black Friday Sale 2023 : శాంసంగ్, లెనోవో టాబ్లెట్లు డిస్కౌంట్ ధరలకు లభిస్తున్నాయి. శాంసంగ్ టాబ్లెట్లు 43 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. 10.4-అంగుళాల స్క్రీన్‌తో ఉండే శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్.. అమెజాన్‌లో కేవలం 199 డాలర్ల ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. వాస్తవానికి వెబ్‌సైట్‌లో ఇది 349 డాలర్ల వద్ద ఉంది. ఇంకా.. శాంసంగ్ నుంచి గెలాక్సీ ట్యాబ్ ఎ8, గెలాక్సీ ట్యాబ్ ఎ7 వంటివి.. 35 శాతం వరకు తగ్గింపు ధరలతో లభిస్తున్నాయి.
Amazon the Beauty Sale: అమెజాన్ "బ్యూటీ సేల్"ను కూడా నిర్వహిస్తోంది. ఈ సేల్ 24 నుంచి 26 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అన్ని రకాల సౌందర్య ఉత్పత్తులపైనా 60 శాతం వరకు, లగ్జరీ బ్యూటీ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. 300 బ్రాండ్లపై ఈ ఆఫర్‌ను ప్రకటించింది అమెజాన్. ప్రతిరోజూ రాత్రి "8PM డీల్స్" పేరుతో అర్ధరాత్రి వరకు ప్రత్యేక ఆఫర్లను ఇస్తోంది. సో.. గతంలో ఆఫర్లను మిస్సైన వారు.. ఇప్పుడు అందుకోండి.
Best Cricket Bats in Lowest Price : బెస్ట్ క్రికెట్ బ్యాట్స్.. తక్కువ ధరలో!