రిలయన్స్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ మనమడు పృథ్వీ అంబానీ బర్త్‌డే పార్టీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా దంపతుల కుమారుడు పృథ్వీ.. బర్త్‌డే పార్టీకి ముంబయిలోని జియో వర్డల్ గార్డెన్ వేదికైంది. వాస్తవానికి డిసెంబరు 10న పృథ్వీ అంబానీ పుట్టినరోజు కాగా.. సోమవారం ఘనంగా అతిథులకు పార్టీ ఇచ్చింది అంబానీ ఫ్యామిలీ. ఈ వేడుకలకు ముకేశ్ కుటుంబసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్‌కు.. శ్లోకా మెహతాతో 2019 మార్చి 9న వివాహమైంది. వీరికి 2020 డిసెంబర్ 10న పృథ్వీ పుట్టాడు. అయితే ఏడాదిన్నర వయసుకే పృథ్వీని ప్లేస్కూల్లో చేర్పించారు ఆకాశ్- శ్లోక దంపతులు. ముంబయి మలబర్ హిల్‌లోని సన్‌ఫ్లవర్ నర్సరీ స్కూల్లో చేర్చారు. ఆకాశ్, శ్లోక కూడా అదే స్కూల్లో తమ విద్యాభ్యాసం ప్రారంభించడం విశేషం.
