ETV Bharat / business

అదిరే ఫీచర్స్, నయా లుక్​తో మారుతీ ఆల్టో కె10, ధర ఎంతంటే - కొత్త బైక్ మోడల్​ను లాంఛ్ చేసిన హోండా

ప్రముఖ వాహనాల ఉత్పత్తి తయారీ సంస్థ మారుతీ సుజుకీ మరో కొత్త మోడల్​ను మార్కెట్​లోకి తెచ్చింది. మారుతీ సుజుకీ ఆల్టో కె10ను గురువారం లాంఛ్ చేసింది. మరోవైపు హోండా కంపెనీ యాక్టివా సిరీస్​లో మరో కొత్త మోడల్ స్కూటర్​ను ఆవిష్కరించింది.

maruti suzuki alto k10
మారుతీ సుజుకీ
author img

By

Published : Aug 18, 2022, 4:54 PM IST

Updated : Aug 18, 2022, 6:39 PM IST

Maruti Alto k10: ప్రముఖ ఆటోమొబైల్‌ ఉత్పత్తుల సంస్థ మారుతీ సుజుకీ.. ఆల్టో సిరీస్​లో మరో కొత్త మోడల్​ను గురువారం లాంఛ్ చేసింది. చిన్నకార్లలో అత్యంత ఆదరణ కలిగిన మారుతీ ఆల్టోను 22 క్రితం మార్కెట్​లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మారుతీ సుజుకీ ఆల్టో కె10 మోడల్​ను లాంఛ్ చేశారు. దీని ధర రూ.3.99 లక్షలు.

మారుతీ సుజుకీ కె10 మోడల్​లో ఆల్టో పాత మోడల్​తో పోలిస్తే అనేక మార్పులు చేశారు. కారు బయట, లోపల డిజైన్​ను మార్చారు. అలాగే సరికొత్త ఫీచర్లతో మార్కెట్​లోకి మారుతీ సుజుకీ కె10ను ప్రవేశపెట్టారు. పెట్రోల్ ట్యాంక్​లో మార్పులు చేశారు. అలాగే లైట్​వెయిట్ హార్ట్​పీస్ ప్లాట్​ఫామ్​ను తీసుకొచ్చారు. ఆల్టో కె10 కారు ప్రారంభ ధర రూ.3.99 లక్షలు. హైఎండ్ వేరియంట్ ధర రూ.5.99 లక్షలు. మారుతీ ఆల్టో కె10 మోడల్ మొత్తం 6 రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
సాలిడ్ వైట్, సిల్కీ సిల్వర్, గ్రానైట్ గ్రే, సిజ్లింగ్ రెడ్, స్పీడీ బ్లూ, ఎర్త్ గోల్డ్ రంగుల్లో ఆల్టో కె10 కార్లు మార్కెట్​లోకి అందుబాటులోకి వచ్చాయి. ఇంజిన్ ట్యాంక్ సామర్థ్యం 27 లీటర్లు. ఈ కారు లీటరు​కు 24.90 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది.

Honda Activa Premium: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మరో మోడల్​ను మార్కెట్లోకి లాంఛ్ చేసింది. హోండా యాక్టివా ప్రీమియంను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్ ధర రూ.75,400. యాక్టివాతో పోల్చితే యాక్టివా ప్రీమియంను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది హోండా. ఈ మోడల్​ మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

ఇవీ చదవండి: వేతనాల పెంపు ఖాయం, 3 నెలలకోసారి ప్రమోషన్‌

ఈ పెట్టుబడులతో మీ పిల్లల ఆర్థిక భవిష్యత్​కు ఫుల్ సేఫ్టీ

Last Updated : Aug 18, 2022, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.