PAN-Aadhaar Link Latest Update : ఆధార్ కార్డ్‌తో పాన్ కార్డును లింక్ చేయాలని కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. లేదంటే.. డీయాక్టివేట్ తప్పదని కూడా హెచ్చరించింది. లింక్ చేయడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(Central Board of Direct Taxes) గడువు ఇచ్చింది. పలుమార్లు పొడిగించింది కూడా. చివరి గడువు కూడా ముగియడంతో.. ఆధార్(Aadhaar)తో అనుసంధానం కానటువంటి పాన్ కార్డులను.. డీయాక్టివేట్ చేయడం ప్రారంభించింది సీబీడీటీ. ఇప్పటి వరకు 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివ్ అయ్యాయి.
CBDT Deactivated 11.5 Crore PAN Cards : దేశవ్యాప్తంగా 70.24 కోట్ల పాన్ కార్డు హోల్డర్లు ఉండగా.. అందులో 57.25 కోట్ల మంది ఆధార్‌తో తమ పాన్ కార్డును అనుసంధానం చేసుకున్నారని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(CBDT) వెల్లడించింది. సుమారు 12 కోట్ల పాన్‌కార్డుదారులు ఆధార్‌తో అనుసంధానం చేయలేదని.. అందులో 11.5 కోట్ల కార్డులు డీయాక్టివ్ అయినట్లు తెలిపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్‌టీఐ (RTI) దరఖాస్తుకు.. సీబీడీటీ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. 2017 జులై 1 కంటే ముందు జారీ చేసిన పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందరూ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం పలు దఫాలుగా కేంద్రం గడువును పొడిగిస్తూ వచ్చింది. తొలుత మార్చి 30 వరకు ఆధార్-పాన్ లింక్‌కు అవకాశం ఇవ్వగా.. చివరి అవకాశంగా జూన్ 30 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.
డెడ్ లైన్ మిస్ అయిన వారికో మరో అవకాశం.. ఎవరి కార్డులైతే డీయాక్టివేట్ అయ్యాయో.. వారి కార్డులను పునరుద్ధరించుకోవడానికి సీబీడీటీ మరో అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం వారు రూ.1000 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే.. 2023 జూన్ 30 గడువును మిస్ అయ్యి ఉంటారో.. వారు పెనాల్టీ చెల్లించి తమ పాన్ కార్డును తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే.. కార్డు యాక్టివేట్ కావడానికి 30 రోజుల సమయం పడుతుంది. ఈ లోగా నిరుపయోగంగా మారిన కారణంగా లావాదేవీలకు పాన్ కార్డును వినియోగించలేరు. దీని కంటే ముందు మీ పాన్ కార్డు యాక్టివ్‌గా ఉందా? లేక డీయాక్టివేట్ అయిందా? అనే విషయం తెలుసుకోండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
How to Get Duplicate PAN Card : పాన్ కార్డ్ పోయిందా ? సింపుల్‌గా ఇలా తీసుకోండి!
పాన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకోనడం ఎలా? (How to Check PAN Card Status ?)
- మీ పాన్ కార్డ్ యాక్టివ్‌గా ఉందో.. లేదో తెలుసుకోవడానికి ముందుగా మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
- ఆ తర్వాత అక్కడ ‘Verify Your PAN’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం ఓపెన్ అయిన పేజీలో మీ పాన్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మొదలైన వివరాలను నమోదు చేయాలి.
- ఆ తర్వాత 'Continue'పై క్లిక్ చేయాలి.
- అంతే మీ పాన్ కార్డు స్టేటస్ స్క్రీన్‌పై డిస్ప్లే అవుతుంది.
పాన్ కార్డు దరఖాస్తు టైమ్‌లో ఈ తప్పులు చేస్తున్నారా? ఇక అంతే!
పెళ్లి తర్వాత పాన్‌కార్డులో ఇంటిపేరు మార్చాలా? - ఫోన్లోనే ఈజీగా మార్చేయండి!