మనకు వీడియోలు ఏమైనా కావాల్సి వస్తే ముందుగా వెతికేది యూట్యూబ్లోనే. అదే పాటల విషయానికొస్తే రకారకాల సైట్లు, యాప్‌లు చూస్తాం. ఇప్పుడు భారతదేశంలో సంగీత ప్రియుల కోసం మ్యూజిక్ ఫ్లాట్‌ఫాంను తీసుకొచ్చింది యూట్యూబ్ సంస్థ. యూట్యూబ్ మ్యూజిక్‌ను ప్రారంభించింది.
యూట్యూబ్ మ్యూజిక్లోఉచితంగా సంగీతం వినొచ్చు. ప్రకటనలు లేకుండా..మరిన్ని సదుపాయాలు కావాలంటేడబ్బులు చెల్లించొచ్చు.
"భారతదేశంలో విభిన్న సంస్కృతీసంప్రదాయాలు ఉన్నాయి. సంగీతానికి అధిక ప్రాధాన్యమిస్తారు.రెండేళ్లలో భారత్‌లో మ్యూజిక్ కల్చర్ బాగా వృద్ధి చెందింది. ఒకవేళ ఈ మ్యూజిక్ ప్లాట్ఫామ్నుఇప్పడు ఆవిష్కరించక పోయినట్లయితే మంచి అవకాశాన్ని వదలుకున్నట్లయ్యేదు"
--- టి.జె ఫౌలర్, యూట్యూబ్ మ్యూజిక్ ప్రొడక్ట్స్ డైరక్టర్
యూట్యూబ్ మ్యూజిక్‌లో ప్రకటనలు లేకుండాసభ్యత్వం కావాలంటే నెలకు రూ.99 రుసుము చెల్లించాలి.మరిన్ని సదుపాయాలతో రూ.129తో మరో ప్లాన్ కూడా ఉంది. ప్రకటనలతో అయితే ఉచితంగానే సంగీతాన్ని ఆస్వాదించొచ్చు.