సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ప్రతీనెలా మదుపరి నిర్ణయించిన ప్రకారం కొంత మొత్తం మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి చేసేందుకు వీలవుతుంది. దీర్ఘకాలంలో చూస్తే స్థిరంగా ఒకే మొత్తం సిప్ పెట్టుబడి కొనసాగించడం కంటే సంవత్సరానికి ఒక సారి పెంచుతూ వెళ్తే వచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్ సంస్థల వద్ద సాధారణ, సిప్ దరఖాస్తులు ఉంటాయి. సిప్ విధానంలో దరఖాస్తు చేసేటప్పుడు ప్రారంభ తేదీ, ప్రతీ నెలా చేయాలనుకుంటున్నపెట్టుబడి, నగదు బదిలీ అయ్యేతేదీ, ముగింపు తేదీ తదితర వివరాలను అందించాలి. కొన్ని ఫండ్లు ఆరు నెలలకోసారి సిప్ మొత్తాన్ని పెంచేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే టాప్ అప్ సిప్‌తో మదుపర్లు ప్రతీ నెలా చేసే పెట్టుబడిని ఏడాదికోసారి పెంచుకుంటూపోవచ్చు.
ముందు ఎంత మొత్తాన్ని సిప్ ద్వారా పెంచాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. భవిష్యత్తులో పెరిగే సిప్ ను చెల్లించేందుకు వీలుపడదు అనుకుంటే గరిష్ఠ పరిమితిని నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు ప్రతీ ఏడాది 5 శాతం చొప్పున సిప్‌లలో వృద్ధి ని చేయాలనుకుంటున్నారు అనుకుందాం. సరిగ్గా పదేళ్ల నతర్వాత మదుపరి చెల్లించాల్సిన సిమ్ మొత్తం నెలకు రూ.11,790, ఇరవై ఏళ్ల నాటికి రూ.30,580 అవుతుంది. మదుపరి నిర్ణయించిన గరిష్ఠ పరిమితి తాకినట్లయితే టాప్ సిప్ విధానం రద్దవుతుంది. గరిష్టంగా ఎంత మొత్తం సిప్ ఉంటుందో అదే మొత్తం మిగిలిన కాలానికి చెల్లించాల్సి ఉంటుంది.
మీ ఆదాయానికి అనుగుణంగా మీ పొదుపు పెరుగుతూ ఉండటానికి టాప్-అప్ సౌకర్యం సమర్థవంతమైన మార్గం. పెట్టుబడిదారులు తమ ఆదాయాన్ని, రిస్క్ తీసుకునే సామర్థ్యానికి అనుగుణంగా కొంత కాలానికి నచ్చిన పెట్టుబడులకు కేటాయింపు చేయడానికి ఇది మంచి సమయం. ఈక్విటీ మార్కెట్లలోని దిద్దుబాటు పెట్టుబడిదారులకు దీన్ని చేయటానికి మంచి అవకాశం ఇచ్చింది.పెట్టుబడిదారులకు వారు కోరుకున్న ఆస్తులను త్వరగా పొందటానికి, యూనిట్ల సముపార్జన ఖర్చును తగ్గించడానికి టాప్-అప్ సౌకర్యం మంచి మార్గం. టాప్-అప్స్‌తో సహా సిప్‌లు పెట్టుబడిదారులు తమ దీర్ఘకాలిక పెట్టుబడి అవసరాలకు మంచి మార్గం అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
అయితే టాప్-అప్ సిప్‌లో వాయిదాల మొత్తంలో పెరుగుదల సాధారణంగా ప్రతి ఆరునెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి మాత్రమే జరుగుతుంది కాబట్టి తగ్గుతున్న మార్కెట్ల నుంచి ప్రయోజనం పొందడానికి టాప్-అప్ సౌకర్యం సమర్థవంతంగా పనిచేయదు. ఆర్థిక సలహాదారుల సూచనలతో రాబోయే 6-12 నెలల్లో క్రమబద్ధమైన బదిలీ ప్రణాళిక ద్వారా లభించే మిగులును పెట్టుబడి పెట్టడం లేదా మార్కెట్లు అవకాశాలను అందించినప్పుడల్లా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మంచిది.
ఇదీ చూడండి: చిన్న మొత్తమైనా 'సిప్'తో ప్రయోజనాలెన్నో..