ETV Bharat / business

జీఎస్టీ రాయితీల్లో అవకతవకలు- ముగ్గురు అరెస్టు - మార్షల్ మల్టీ వెంచర్లు

జీఎస్టీ రాయితీలను వినియోగదారులకు బదిలీ చేయడంలో అవకతవకలు చేసి డబ్బులు కాజేసిన ముగ్గురిని డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు. మొత్తంగా రూ. 2,350 కోట్లు మోసం చేసినట్లు పేర్కొన్నారు.

DGGI GST
జీఎస్టీ రాయితీ అవకతవకల్లో ముగ్గురు అరెస్టు
author img

By

Published : Nov 26, 2020, 6:18 AM IST

జీఎస్టీ రాయితీలను వినియోగదారులకు బదిలీ చేయకుండా ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌లో అవకతవలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపింది డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటిలిజెన్స్‌. ఈ మేరకు బుధవారం మరో మూడు కేసులు నమోదు చేసింది.

రూ. 2,350 కోట్ల కాజేసిన ముగ్గురు వ్యక్తులను డీజీజీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీరంతా నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించి అక్రమంగా ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌లు పొందినట్లు గుర్తించారు.

ఆ ముగ్గురు వీరే...

ఎర్మాన్‌ మెటల్స్‌, పయనీర్‌ ట్రేడింగ్‌కో, మార్షల్ మల్టీ వెంచర్లతో సహా వివిధ సంస్థల్లో భాగస్వామిగా ఉంటూ రూ.485.64 కోట్ల మోసానికి పాల్పడ్డ సచిన్‌ భోర్కాను డీజీజీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కర్జెన్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌, బ్లూసీ కమోడిటీస్‌, థీమ్‌ లైట్స్‌ సంస్థలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న మహేష్‌ కింగర్‌ రూ. 1,159 కోట్లు కొల్లగొట్టారని గుర్తించారు. వీరితో పాటు రూ. 220 కోట్ల రూపాయల ఇన్​పుట్ టాక్స్ మోసానికి పాల్పడిన మరో వ్యక్తిని కూడా డీజీజీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి:కొత్త సంవత్సరానికి సామ్​సంగ్​ కొత్త ఫోన్లు- ఫీచర్లు ఇవే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.