స్టాక్ మార్కెట్లు (Stock Market) సోమవారం దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 29 పాయింట్లు పెరిగి కొత్త రికార్డు స్థాయి అయిన 60,078 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 2 పాయింట్ల లాభంతో 17,855 వద్దకు చేరింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
- మారుతీ సుజుకీ, ఎం&ఎం, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాలను గడించాయి.
- హెచ్‌సీఎల్‌టెక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, ఎల్&టీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీలు లాభాలను గడించాయి. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్) సూచీలు నష్టపోయాయి.