స్టాక్ మార్కెట్లు బుధవారం రికార్డు స్థాయి లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 1,148 పాయింట్లు బలపడి 51,445 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 326 పాయింట్ల లాభంతో 15,246 వద్దకు చేరింది.
అమెరికా కరోనా ఉద్దీపనపై సానుకూల అంచనాలు, ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్ల జోరు సహా బ్యాంకింగ్, ఐటీ, లోహ షేర్లు రాణించడం వల్ల దేశీయ మార్కెట్లు ఈ స్థాయిలో పుంజుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బుధవారం సెషన్లో వాహన షేర్లు మినహా దాదాపు అన్ని రంగాలు లాభాలను గడించాయి.
ఇంట్రాడే సాగిందిలా..
- సెన్సెక్స్ 51,539 అత్యధిక స్థాయిని; 50,512 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.
- నిఫ్టీ 15,273 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,995 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.