ETV Bharat / business

నష్టాలతో ముగిసిన మార్కెట్లు- 14,900 దిగువకు నిఫ్టీ - షేర్ మార్కెట్​ లైవ్​

stocks Live updates
స్టాక్ మార్కెట్లు లైవ్​
author img

By

Published : May 11, 2021, 9:28 AM IST

Updated : May 11, 2021, 3:41 PM IST

15:39 May 11

స్టాక్ మార్కెట్ల వరుస లాభాల జోరుకు బ్రేక్ పడింది. మంగళవారం సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్ 341 పాయింట్ల నష్టంతో 49,161 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోయి 14,850 వద్దకు చేరింది.  

  • ఎన్​టీపీసీ, ఓఎన్​జీసీ, పవర్​గ్రిడ్​, సన్​ఫార్మా, అల్ట్రాటెక్​ సిమెంట్ లాభాలను గడించాయి.
  • కోటక్ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​యూఎల్​, బజాజ్​ ఫినాన్స్, బజాజ్​ ఫిన్​సర్వ్​ షేర్లు నష్టాలతో ముగిశాయి.

11:56 May 11

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 280 పాయింట్లకుపైగా కోల్పోయి 49,222 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్లకుపైగా నష్టంతో 14,871 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్​టీపీసీ, సన్​ఫార్మా, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ, ఇండస్​ఇండ్​ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫినాన్స్, ఎం&ఎం షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:08 May 11

14,800 దిగువకు నిఫ్టీ

స్టాక్ మార్కెట్ల వరుస లాభాల జోరుకు బ్రేక్​ పడింది. మంగళవారం సెషన్​ను సూచీలు భారీ నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ దాదాపు 450 పాయింట్లు కోల్పోయి 49,055 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 140 పాయింట్లకుపైగా తగ్గి 14,798 వద్ద కొనసాగుతోంది.

ఫార్మా మినహా మిగతా అన్ని రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దేశంలో కరోనా విజృంభణ తీవ్రమవుతుండటం, దాదాపు అన్నిరాష్ట్రాల్లో మిని లాక్​డౌన్​లు సహా ఇటీవలి వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

  • సన్​ఫార్మా, ఎన్​టీపీసీ, డాక్టర్​ రెడ్డీస్​, నెస్లే ఇండియా మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్​ ఇండ్ బ్యాంక్, ఓఎన్​జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

Last Updated : May 11, 2021, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.