స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల మధ్య ట్రేడవుతున్నాయి. ఆరంభంలో 200 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 30 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. 38,376 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ఆటోమొబైల్ షేర్లు రాణించడం వల్ల సూచీ కాస్త కోలుకుంది. మరోవైపు ఫార్మా సంస్థల షేర్లు నేల చూపులు చూస్తున్నాయి.
అటు.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం ఆరంభ నష్టాలు తగ్గించుకుంది. ప్రస్తుతం 9 పాయింట్లు నష్టపోయి 11,313 వద్ద ట్రేడవుతోంది.