స్టాక్ మార్కెట్ల రికార్డు జోరుకు వారాంతంలో బ్రేక్ పడింది. బీఎస్ఈ- సెన్సెక్స్ (Sensex today) 215 పాయింట్లు తగ్గి 54,277 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 56 పాయింట్ల నష్టంతో 16,238 వద్దకు చేరింది.
మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ షేర్లు భారీగా నష్టపోవడం కూడా నష్టాలకు కారణమంటున్నారు నిపుణులు. ఫ్యూచర్ గ్రూప్‌తో వివాదంలో సుప్రీం ధర్మాసనం అమెజాన్‌కు అనుకూలంగా తీర్పునివ్వడం కారణంగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఫ్యూచర్ రిటైల్ కొనుగోలుకు రిలయన్స్ రిటైల్ గత ఏడాది భారీ ఒప్పందం కుదుర్చుకున్న విషయం విధితమే.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 54,633 పాయింట్ల అత్యధిక స్థాయి, 54,210 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 16,336 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 16,223 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, మారుతీ, ఎన్టీపీసీ షేర్లు ప్రధానంగా లాభాలను గడించాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్‌టెక్, హెచ్డీఎఫ్సీ ఎక్కువగా నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో నిక్కీ (జపాన్).. మినహా.. షాంఘై (చైనా), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్‌సెంగ్ (హాంకాంగ్) సూచీలు నష్టాలతో ముగిశాయి.
ఇదీ చదవండి: ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్‌కు షాక్- సుప్రీంలో అమెజాన్ విజయం