ETV Bharat / business

ప్రపంచ మార్కెట్లను పాతాళానికి నెట్టేసిన కరోనా

author img

By

Published : Mar 12, 2020, 12:34 PM IST

కరోనా భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడి తాజా ప్రకటనతో ఇవాళ మరింత కుంగిపోయాయి. అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియా, హాంకాంగ్​ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి.

WORLD MARKETS
కరోనా

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఐరోపాకు రాకపోకలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ నిలిపివేయటం ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. చమురు ధరలు భారీగా పడిపోయాయి. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారి తీస్తాయన్న భయాలు మదపరుల్లో నెలకొనటం వల్ల అన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలు భారీగా నష్టపోయాయి.

కరోనా వైరస్​ను అంతర్జాతీయ మహమ్మారిగా డబ్ల్యూహెచ్​ఓ ప్రకటించిన తర్వాత ఆసియా మార్కెట్లు భారీగా పడిపోయాయి. ట్రంప్ చేసిన ప్రసంగం అనంతరం మరింత దిగజారాయి.

అన్ని మార్కెట్లూ పాతాళానికే..

జపాన్ మార్కెట్ నిక్కీ 4.4 శాతం నష్టాలతో ముగిసింది. అస్ట్రేలియా మార్కెట్ ఏఎస్​ఎక్స్​ 200 7.4 శాతం పడిపోయింది. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత ఆ స్థాయి నష్టాలను నమోదు చేసింది. హాంకాంగ్​ 3.5 శాతం, చైనా షాంఘై కాంపొజిట్​ 1.6 శాతం నష్టాల్లో ఉన్నాయి.

దక్షిణ కొరియా, సింగపూర్​, ఇండోనేసియా మార్కెట్లు 3 శాతం మేర పడిపోయాయి. బ్యాంకాక్​ మార్కెట్​ 8 శాతం పతనమైంది.

అమెరికాలోనూ..

అమెరికా వాల్​ స్ట్రీట్​ మరోసారి భారీ నష్టాలను చవిచూసింది. బోయింగ్ నుంచి లాభాలను ఉపసంహరించుకున్నట్లు హిల్టన్ ప్రకటన మరింత దెబ్బతీసింది. 20 శాతం పతనమై తాజాగా బేర్​ గుప్పిట్లోకి వెళ్లిన డౌజోన్స్​ మళ్లీ పాతాళానికి చేరింది.

ట్రంప్ ప్రకటన..

ఐరోపాలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు ట్రంప్​. బ్రిటన్​ మినహా ఐరోపా దేశాలన్నింటికీ 30 రోజుల పాటు ప్రయాణాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.

రష్యా, సౌదీ అరేబియా మధ్య చమురు యుద్ధంతో కొద్ది రోజులుగా క్రూడ్​ ధరలు భారీగా పతనమయ్యాయి. ట్రంప్​ ప్రసంగానికి ముందు కాస్త పుంజుకున్నా... ఐరోపాకు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు చేసిన ప్రకటన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు 6 శాతం పడిపోయాయి.

4,200 మంది మృతి..

చైనా వుహాన్​లో మొదలైన కరోనా వైరస్​.. ప్రపంచంలోని 107 దేశాలకు విస్తరించింది. వైరస్​ కారణంగా ఇప్పటికీ వరకు ప్రపంచవ్యాప్తంగా 4,200 మంది చనిపోయారు. మరో 1,17,330 మంది వైరస్ బారిన పడ్డారు. చైనా తర్వాత ఇటలీలో అత్యంత వేగంగా వ్యాపిస్తోంది వైరస్​. ఈ దేశంలో ఇప్పటివరకు 631 మంది మృతిచెందారు.

ఇదీ చూడండి: ఢమాల్​ స్ట్రీట్​: రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.