Stocks Closing: దేశీయ స్టాక్ మార్కెట్ వారంతపు సెషన్‌ను నష్టాలతో ముగించాయి. ఆరంభంలో భారీ లాభాలు నమోదు చేసిన సూచీలు.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో ఒడుదొడుకుల ఎదుర్కొన్నాయి. చివరకు సెన్సెక్స్ 77 పాయింట్లు తగ్గి.. 57,200 వద్ద బలపడింది. నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,104 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ ఉదయం 57,795 పాయింట్లు వద్ద భారీ లాభాలతో ప్రారంభమైంది. మిడ్ సెషన్ వరకు లాభాల్లో కొనసాగిన మార్కెట్లు.. ఆఖరులో అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో 58,084 వద్ద గరిష్ఠానికి చేరింది. రోజులో 965 పాయింట్లు మధ్య కదలాడిన సూచీ.. మరో దశలో 57,119 వద్ద కనిష్ఠాన్ని తాకింది.
మరో సూచీ ఎన్ఎస్ఈ-నిఫ్టీ 17,208 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 17,373 పాయింట్ల గరిష్ఠానికి చేరి.. 17,077 వద్ద కనిష్ఠాన్ని తాకింది.
లాభానష్టాల్లోనివి ఇవే..
ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్బ్యాంకు, ఎం అండ్ ఎం, విప్రో, ఐటీసీ, భారతీఎయిర్‌టెల్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ షేర్లు ప్రధానంగా లాభాలు గడించాయి.
మారుతి, టెక్‌మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐబ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐఎన్, బజాజ్‌ఫిన్‌సర్వ్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
కారణాలివే..
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియడం మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవ్వడంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు.
ఆరంభంలో భారీగా కొనుగోళ్లకు దిగిన మదుపరులు.. మిడ్‌సెషన్ తర్వాత లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం వల్ల సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి.
ఇదీ చూడండి: Union Budget 2022: 'ఉద్యోగాలు సృష్టించే బడ్జెట్ అవ్వాలి'