స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్లోనూ భారీ నష్టాల్లో ముగిశాయి. వారాంతపు సెషన్లో సెన్సెక్స్ 434 పాయింట్లు తగ్గి 50,890 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 15 వేల మార్కును కోల్పోయింది. 137 పాయింట్లు కోల్పోయి 14 వేల 982 వద్ద ముగిసింది.
బ్యాంకింగ్ షేర్లు కుదేలయ్యాయి. ఆటో, ఇన్ఫ్రా, లోహ, ఫార్మా రంగాల షేర్లు.. 1-2 శాతం మేర పడిపోయాయి.
ఆరంభంలో లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 51,433 పాయింట్ల గరిష్ఠాన్ని.. 50,624 వద్ద కనిష్ఠాన్ని తాకి చివరకు 50,890కి చేరింది.
లాభాల్లోని షేర్లు..
డాక్టర్ రెడ్డీస్, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్యూఎల్, ఎన్టీపీసీ, రిలయన్స్, టీసీఎస్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.
నష్టాల్లోనివి..
ఓఎన్జీసీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ, బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
ఇదీ చదవండి: మల్టీ క్యాప్..ఫ్లెక్సీ క్యాప్..పెట్టుబడికి ఏది మేలు?