స్టాక్ మార్కెట్లు మంగళవారం సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. బీఎస్ఈ- సెన్సెక్స్ (Sensex today) 873 పాయింట్లు పెరిగి నూతన గరిష్ఠ స్థాయి అయిన 53,823 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 246 పాయింట్ల లాభంతో జీవనకాల గరిష్ఠమైన 16,131 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 53,887 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవితకాల గరిష్ఠం) 53,088 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 16,146 పాయింట్ల గరిష్ఠ స్థాయి (నూతన రికార్డు స్థాయి), 15,914 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టైటాన్, హెచ్డీఎఫ్సీ, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ సూచీలు మెరిశాయి.
30 షేర్ల ఇండెక్స్‌లో ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, టాటా స్టీల్ మాత్రమే స్వల్పంగా నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. కోస్పీ మినహా.. షాంఘై, నిక్కీ, హాంగ్‌సెంగ్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చదవండి: ఓలా తొలి ఈ-స్కూటర్ విడుదల ఎప్పుడంటే..