అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఐటీ కంపెనీలు లాభాలను మూటగట్టుకున్నాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ-సెన్సెక్స్ 168.62 పాయింట్లు బలపడి 39,784.52 వద్ద ముగిసింది. ఇన్ట్రాడేలో ఓ స్థాయిలో 39,979.48 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ-నిఫ్టీ 52.05 పాయింట్లు లాభపడి 11,922.90 వద్ద ముగిసింది. ఇన్ట్రాడేలో ఓ స్థాయిలో 11,975.05 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 69.54 వద్ద అమ్ముడవుతోంది.
లాభాల్లోనివి
బ్రిటానియా, టెక్ మహీంద్ర, టీసీఎస్, ఇన్ఫోసిస్, రెడ్డీస్ ల్యాబ్య్ లాభాలను మూటగట్టుకున్నాయి.
నష్టాల్లోనివి
బీపీసీఎల్, యెస్ బ్యాంక్, కోల్ ఇండియా, గేయిల్, ఐఓసీఎల్ వంటి సంస్థలు భారీ నష్టాలతో ముగిశాయి.