ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తున్నతరుణంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
415 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. 40వేల 754 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 128 పాయింట్లు నష్టపోయి 11వేల 951 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివి...
ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్రా, టీసీఎస్, హెయూఎల్, సన్‌ఫార్మా సంస్థల షేర్లు లాభాల్లో ఉన్నాయి.
టాటా స్టీల్, వేదాంతా, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, కొటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్‌ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ సంస్థల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
ముడిచమురు...
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 2.52 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 56.48 డాలర్లుగా ఉంది.
రూపాయి...
రూపాయి విలువ 19పైసలు తగ్గి, ఒక డాలరుకు రూ.71.83గా ఉంది.