ప్యాకేజీల ఆశలు..
స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండో రోజూ బుల్ జోష్ కొనసాగింది. సెన్సెక్స్ ఏకంగా 1,862 పాయింట్లు బలపడి 28,536 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 517 పాయింట్లు పుంజుకుని 8,318కి చేరింది.
అమెరికా ఆర్థిక వ్యవస్థకు 2 ట్రిలియన్ డాలర్ల సాయం అందించే ప్యాకేజీపై సెనెట్ నాయకులు, శ్వేతసౌదం ఒక అవగాహనకు వచ్చారు. భారత్ కూడా ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనలు ఇస్తుందన్న ఆశలు మదుపరుల సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. ఈ రెండు అంశాలు మార్కెట్ల భారీ లాభాలకు కారణమయ్యాయి.