ETV Bharat / business

స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు - SENSEX

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ముగిశాయి. 161 పాయింట్ల లాభంతో సెన్సెక్స్​ 36, 724 వద్ద ముగిసింది. నిఫ్టీ 46 పాయింట్ల వృద్ధితో 10, 844 వద్ద స్థిరపడింది.

స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
author img

By

Published : Sep 4, 2019, 4:22 PM IST

Updated : Sep 29, 2019, 10:25 AM IST

వృద్ధి మందగమనంతో మంగళవారం భారీ నష్టాలను మూటగట్టుకుంటున్న దేశీయ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం ఒడుదొడుకుల మధ్య ప్రారంభమై.. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలతో స్వల్ప లాభాల్లోకి వచ్చాయి.

బొంబాయి స్టాక్​ ఎక్ఛ్సేంజి సూచీ- సెన్సెక్స్​ 161.83 పాయింట్ల లాభంతో 36, 724.74 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్ఛ్సేంజి సూచీ-నిఫ్టీ 0.43 శాతం వృద్ధితో 46.75 పాయింట్ల లాభాన్ని మూటగట్టుకుని 10,844.65 వద్ద ముగిసింది.

ఇన్​ట్రా డేలో ఓ దశలో 36,776.31 పాయింట్ల గరిష్ఠ స్థాయిని చేరింది సెన్సెక్స్​. ఉదయం ఫ్లాట్​గా ప్రారంభమైన నిఫ్టి ఓ దశలో 10,858.75 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది.

లాభనష్టాల్లోనివి..

వేదాంత, ఎన్​టీపీస్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, హెచ్​సీఎస్​ టెక్​, ఓఎన్​జీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్​టెల్​, ఎస్బీఐ, టాటా స్టీల్​ సుమారు 2.97 శాతం లాభాలను మూటగట్టుకున్నాయి.

హరియాణాలోని గురుగ్రామ్​, మనేసర్ పరిశ్రమల్లో రెండు రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేసినట్లు ప్రకటించిన మారుతి సుజూకీ అత్యధికంగా 3.64 శాతం నష్టపోయింది. సన్​ ఫార్మా, టాటా మోటర్స్​, బ్రిటానియా, ఎషియన్​ పేయింట్స్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఎం&ఎం, బజాజ్​ ఆటో, ఆర్​ఐఎల్​ సుమారు 2.97 శాతం నష్టాల్లోకి వెళ్లాయి.

ఇదీ చూడండి: అత్యంత నివాసయోగ్య నగరాల్లో భారత్​లో పరిస్థితి ఇదీ..

Intro:Body:

m

Conclusion:
Last Updated : Sep 29, 2019, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.