స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్‌ను భారీ లాభాలతో ముగించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 613 పాయింట్ల లాభపడి 50,193 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 185 పాయింట్లు పుంజుకుని 15,108 వద్ద ముగిసింది.
కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటం సహా.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాల్లో ముగిసినట్లు నిపుణులు విశ్లేషించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు మార్కెట్లలో జోరు నింపాయి. ఐటీ, ఫార్మా రంగ కంపెనీల షేర్లు సైతం లాభాలు గడించాయి.
గత రెండు రోజులుగా మార్కెట్ల బలమైన ర్యాలీతో.. సెన్సెక్స్‌లో మదుపరుల సంపద రూ.5.78లక్షల కోట్లు(2.99శాతం) పెరిగింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,313 పాయింట్ల అత్యధిక స్థాయి, 49,959 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,137 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,044 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లో..
30 షేర్ల ఇండెక్స్‌లో భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐఎన్, మినహా.. ఇతర షేర్లన్నీ భారీ లాభాలను ఆర్జించాయి.