స్టాక్ మార్కెట్లు (Stock Market today) గురువారం సెషన్ నష్టాలను నమోదు చేశాయి. ఒడుదొడుకులతో ప్రారంభమైన సూచీలు భారీ నష్టాల నుంచి తేరుకున్నాయి. బీఎస్‌ఈ-సెన్సెక్స్ (Sensex today) దాదాపు 336 పాయింట్లకుపైగా పతనమై.. 61,923 వద్ద ముగిసింది. నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 18,178 వద్ద స్థిరపడింది.
ఐటీ, లోహ, రియాల్టీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 1-3 శాతం మేర పతనమయ్యాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు రెండో రోజు 1 శాతం చొప్పున క్షీణించాయి.
ఇంట్రాడే సాగిందిలా..
నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ 61,621 పాయింట్ల అత్యధిక స్థాయి చేరుకుంది. ఒకానొకదశలో 60,485 పాయింట్లకు అత్యల్ప స్థాయికి చేరుకుంది. తిరిగి తిరిగి తేరుకుని.. 60,923 పాయింట్ల వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 18,384 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 18,048 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
- కొటక్ బ్యాంకు 6.28 శాతం, ఐసీఐసీఐ 1.80, హెచ్డీఎఫ్ 1.77, ఎన్టీపీసీ 1.06, యాక్సిస్ 1.01, ఎస్బీఐఎన్ 0.91 శాతం లాభాలను గడించాయి.
- ఏషియన్ పెయింట్ 4.85 శాతం, ఇన్ఫోసిస్ 2.42 , రిలయన్స్ 2.40, టీసీఎస్ 2.07, డాక్టర్ రెడ్డీస్ 2.05, టాటా స్టీల్ 2.04, భారతీ ఎయిర్టెల్ 1.84 నష్టాలు మూటగట్టుకున్నాయి.
ఇదీ చూడండి: Amazon Prime: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్!