ETV Bharat / business

ఆర్థిక షేర్లు బెంబేలు- నష్టాలతో ముగిసిన మార్కెట్లు - share market today

దేశీయ స్టాక్​ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 31పాయింట్లు కోల్పోయి 50,363 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 19 పాయింట్లు క్షీణించి 14,910 వద్దకు చేరింది.

Stock markets closed with losses on Tuesday
ఆర్థిక షేర్లు బెంబేలు.. నష్టాలతో ముగిసిన మార్కెట్లు
author img

By

Published : Mar 16, 2021, 3:38 PM IST

Updated : Mar 16, 2021, 4:31 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం సెషన్​లో ఫ్లాట్​గా ముగిశాయి. ఒకానొక దశలో సెన్సెక్స్‌ 400 పాయింట్లుకు పైగా లాభపడింది. ఈ దశలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో సూచీలు డీలాపడ్డాయి. బొంబాయి స్టాక్​ ఎక్సేంజి సూచీ సెన్సెక్స్ 31పాయింట్లు తగ్గి... 50 వేల 363 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 19 పాయింట్లు పడిపోయి 14 వేల 910 వద్ద సెషన్​ను ముగించింది.

ఐటీ షేర్లు రాణించగా.. ఆర్థిక షేర్లు నష్టాలను చవి చూశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 50,857 అత్యధిక స్థాయిని; 50,289 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.

నిఫ్టీ 15,051 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,890 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభాల్లో... ​

ఏషియన్​ పెయింట్స్​, డా. రెడ్డీస్​, హిందుస్థాన్​ యూనిలివర్​, ఐటీసీ, హెచ్​సీఎల్​ టెక్​, భారతీ ఎయిర్​టెల్​, టీసీఎస్​, మారుతి, ఇన్ఫోసిస్​ లాభాలు గడించాయి.

నష్టాల్లో...

ఎల్​ అండ్ ​టీ, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ, కోటక్​ బ్యాంక్​, బజాజ్​ ఫిన్​సర్వ్​ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.

Last Updated : Mar 16, 2021, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.