Stock Market Today India: స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలను నమోదు చేశాయి. ఆర్థిక, ఐటీ రంగం షేర్లు రాణించడం వల్ల బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 620 పాయింట్లు వృద్ధి చెంది 57 వేల 685 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 183 పాయింట్లు పెరిగి 17 వేల 167కి చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 57,846 పాయింట్ల అత్యధిక స్థాయి, 57,347 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,213 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,064 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లో..
ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ , ఎస్బీఐ, టెక్ మహీంద్రా, మారుతి, రిలయన్స్ షేర్లు భారీగా లాభాలు నమోదు చేశాయి.
డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్ టెల్, టైటాన్ షేర్లు నష్టపోయాయి.
ఇదీ చూడండి: నవంబర్లోనూ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు