సెన్సెక్స్ 1300 ప్లస్..
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోష్లో.. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి.
సెన్సెక్స్ 1360 పాయింట్లకుపైగా పెరిగి 56 వేల మార్కు ఎగువకు చేరింది.
నిఫ్టీ 390 పాయింట్లు లాభంతో.. 16 వేల 730 వద్ద కొనసాగుతోంది.
ఆటో, బ్యాంకింగ్, రియాల్టీ, పీఎస్యూ బ్యాంకింగ్ రంగం.. 2-3 శాతం మేర లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1 శాతం మేర పెరిగాయి.
యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ 6 శాతానికిపైగా రాణించాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, గ్రేసిమ్ కూడా మంచి లాభాల్లో ఉన్నాయి.
కోల్ ఇండియా, హిందాల్కో, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ నష్టాల్లో ఉన్నాయి.
ఆయా రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగే అవకాశాలు కనిపించని నేపథ్యంలో.. స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, మణిపుర్లో భాజపా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. గోవాలో పోటాపోటీగా ఫలితాలు వెలువడుతుండగా.. పంజాబ్లో ఆప్ దూసుకెళ్తోంది.