ఒమిక్రాన్ భయాలతో ఫ్లాట్గా సూచీలు
ఒమిక్రాన్ భయాలతో దేశీయ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఆరంభంలో భారీ లాభాలతో దూసుకెళ్లిన సూచీలు.. క్రమంలో తగ్గుముఖం పట్టాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.
ముంబయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 170 పాయింట్ల లాభంతో 57,958 వద్ద కొనసాగుతోంది.
58,243 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ.. ఒకానొక దశలో 58,337 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. అయితే.. ఒమిక్రాన్ భయాలతో మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపటం వల్ల 57,716 పాయింట్ల కనిష్ఠాన్ని తాకి.. కాస్త పుంజుకున్నాయి.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ.. 38 పాయింట్ల వృద్ధితో 17,259 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ సైతం ఒకానొక దశలో 17,195 పాయింట్ల కనిష్ఠాన్ని తాకి..ప్రస్తుతం 17,259 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.